క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రేమికుల రోజుగా పేర్కొనబడింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు హోటల్ రూమ్స్ బుకింగ్స్ గతంలో కంటే ఎక్కువగా పెరిగాయి. మరి ముఖ్యంగా ఈ వాలెంటైన్స్ డే రోజు ఆసరాగా తీసుకొని ఓయో ప్రత్యేక ఆఫర్ల పేరుతో రూమ్స్ బుకింగ్స్ పై డిస్కౌంట్లు ప్రకటిస్తున్నారు. కొంతమంది ఈరోజును ఆసరాగా తీసుకొని ప్రత్యేకంగా కూపన్లు అంటూ ప్రేమికులకు ప్రత్యేకమైనటువంటి ఆఫర్లు అంటూ సోషల్ మీడియాలో పలు వెబ్సైట్లు ఓపెన్ చేయాలని టెంప్టింగ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఒక్కరోజు రూమ్ బుకింగ్స్ విషయం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి అని.. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న మీ వ్యక్తిగత వివరాలు హ్యాకర్ల చేతికి వెళ్లి పోతాయి అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అలాగే మహిళలు ఈ సోషల్ మీడియా యాప్స్ ద్వారా ఎవరిని పడితే వారిని నమ్మొద్దు అని.. తెలిసిన వ్యక్తులతో మాత్రమే మాట్లాడాలి అని సూచిస్తున్నారు. మీ ఫోటోలు లేదా నెంబర్లు వంటివి ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో ఉపయోగించవద్దు అని స్పష్టం చేశారు. కాబట్టి తెలియని వ్యక్తులనుంచి వచ్చేటువంటి ఏ విషయాన్నీ కూడా మీరు లైట్ తీసుకోవద్దు. అసలే ఇవాళ వాలెంటైన్స్ డే సందర్భంగా ఎన్ని వింతలు జరుగుతాయి అని సామాన్యులు సైతం భయాందోళనకు గురవుతున్నారు. మీరు స్టే చేసేటువంటి రూమ్స్ ని కూడా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి అని సూచిస్తున్నారు.
శివరాత్రి రోజు మాంసం అమ్మకాలు నిషేధం : గ్రేటర్ బెంగళూరు అథారిటీ
మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ బలపడింది
