
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు నెలల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు ఎన్నో రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇక చివరిసారిగా మొంథా తుఫాన్ ఎఫెక్ట్తో భారీ పంట నష్టం వాటిల్లింది. తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గిపోయిన తరువాత ప్రతి ఒక్కరు కూడా హమ్మయ్య అని.. ఇక వర్షాల ప్రభావం పంటలపై చూపదులే అని ప్రశాంతంగా ఉన్న సమయంలో IMD అధికారులు కీలక ప్రకటన చేశారు. ఈనెల 17వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆదివారం మొదలుకొని మంగళవారం వరకు కూడా రాష్ట్రంలోని పలు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. అయితే ఈ వర్షాలు ఎక్కువగా ప్రభావం చూపవని.. సాధారణంగా వర్షాలు కురిసి తగ్గిపోతాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న సమయంలో.. మరోవైపు ఇప్పటికే కొన్ని జిల్లాలలో చలి తీవ్రత భారీగా పెరిగింది. మొన్నటి వరకు వర్షాలతో ఇబ్బందులు పడ్డ ప్రజలు నిన్న, మొన్నటి నుంచి చలి తీవ్రత వల్ల ఇబ్బందులు పడుతున్నారు. నిన్న అత్యల్పంగా అల్లూరి జిల్లాలో 14.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయ్. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ చలికాలంలో అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకోకుండా తగు జాగ్రత్తలు పాటించాలి అని సూచించారు. ఈ నెల 17 మరియు 18వ తేదీలలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆ రెండు రోజులు మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఇక ఆ తర్వాత నుంచి పూర్తిస్థాయిలో వర్షాలు అయితే పడే అవకాశాలు చాలా తక్కువ.
Read also : మరోసారి ఉలిక్కిపడ్డ ఢిల్లీ.. రాడిసన్ హోటల్ సమీపంలో భారీ శబ్ధంతో పేలుడు
Read also : Crime: మతిస్థిమితం కోల్పోయి భార్యపై కత్తితో దాడి చేసిన వ్యక్తి.. చివరికి





