అంతర్జాతీయం

మరోసారి అఫ్గానిస్థాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.2 తీవ్రతగా నమోదు

క్రైమ్ మిర్రర్, ఆన్‌లైన్‌ డెస్క్: అఫ్గానిస్థాన్‌లో మరోసారి భూకంపం సంభవించింది. భారత కాలమానం ప్రకారం ఉదయం 2:20 గంటలకు

క్రైమ్ మిర్రర్, ఆన్‌లైన్‌ డెస్క్: అఫ్గానిస్థాన్‌లో మరోసారి భూకంపం సంభవించింది. భారత కాలమానం ప్రకారం ఉదయం 2:20 గంటలకు భూకంపం నమోదైంది. రిక్టర్ స్కేలు ప్రకారం దీని తీవ్రత 4.6గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రాణహాని లేదా ఆస్తినష్టం సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా అందుబాటులో లేదు. ఈ నెల 4న ఉత్తర అఫ్గానిస్థాన్ ప్రాంతంలో ఒక శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఆ విపత్తులో సుమారు 27 మంది మరణించగా, 956 మంది గాయపడ్డారని తాలిబాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి షరాఫత్ జమాన్ అమర్ వెల్లడించారు.

ఈ భూకంపం దేశంలోని ప్రసిద్ధ మసీదు ఒకటిని తీవ్రంగా దెబ్బతీసింది. హిందూ కుష్ ప్రాంతంలో భారతీయ-యూరేషియన్ ప్లేట్‌ల సరిహద్దు కారణంగా అక్కడ తరచుగా భూకంపాలు సంభవిస్తాయని నిపుణులు తెలిపారు. భూగర్భ శాస్త్రవేత్తలు ఆ ప్రాంతంలో భూకంపాలపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. స్థానిక ప్రజలు భూకంపాల సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.

ALSO READ: Entertainment: బీచ్‌లో అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తున్న రకుల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button