జాతీయం

అల్లు అర్జున్ vs మెగా ఫ్యామిలీ గొడవలు... బాలయ్య

గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లో అల్లు అర్జున్కి అలాగే మెగా ఫ్యామిలీకి గొడవలు జరుగుతున్నట్లుగా సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు. అయితే ఎలక్షన్ టైం లో పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా కాకుండా వైసిపి అభ్యర్థి అయినటువంటి తన ఫ్రెండ్ కి అల్లు అర్జున్ సహాయం చేయడం పై యావత్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చించుకున్న విషయమే.

అల్లు అర్జున్ అలాగే మెగా ఫ్యామిలీ అనేవి ఎలక్షన్ టైం లో చాలానే వినిపించాయి. ప్రతి ఒక్కరు కూడా వీళ్ళిద్దరి గొడవలు గురించి మాట్లాడుకున్నవారే. అయితే ఇవి ఎలక్షన్ టైంలో అందరి దృష్టిని ఆకర్షించడంతోపాటు మెగా అభిమానులకి అలాగే అల్లు అర్జున్ ఆర్మీకి చాలా గొడవలు జరిగాయి. ఎన్ని విధాలుగా వారిద్దరు గొడవలు పెట్టుకుని ముగిసిపోయిన సరే ఫ్యాన్స్ మాత్రం అంతటితో ఆగలేదు. ప్రతిరోజు కూడా మెగా ఫ్యాన్స్ అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తీవ్రంగా ఆరోపించుకుంటున్నారు.

Read More : రాజేంద్ర ప్రసాద్ ను పరామర్శించిన రెబెల్ స్టార్

అయితే ప్రస్తుతం బాలయ్య హోస్టుగా చేసే అన్ స్టాపబుల్ ప్రోగ్రాం కి అల్లు అర్జున్ వస్తున్నాడని ఇప్పటికే సమాచారం అందించారు. అయితే ఇందులో బాలయ్య ముక్కుసూటిగా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయకుండా వైసిపి అభ్యర్థికి ఎందుకు సపోర్ట్ చేశావని ప్రశ్నించినట్టు కూడా తెలుస్తుంది. దీనికి అల్లు అర్జున్ కూడా అవును అని సమాధానం చెబుతూ జరిగిందంతా చెప్పుకొచ్చినట్లు సమాచారం అంది. మరి ఈ షో ద్వారా అయినా కచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య గొడవలు అనేవి తగ్గిపోతాయా లేక అల్లు అర్జున్ మళ్లీ ఏమైనా కొత్తగా ట్విస్టులు ఏమన్నా ఇస్తాడా అనేది వేచి ఉండాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button