Uncategorizedజాతీయం

రాజేంద్ర ప్రసాద్ ను పరామర్శించిన రెబెల్ స్టార్

ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్‌ కూతురు గాయత్రి అక్టోబర్ 4న గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటనతో రాజేంద్ర ప్రసాద్ కుటంబం శోకంలో మునిగిపోయింది. దీంతో సినీ పరిశ్రమకి చెందిన పలువురు ప్రముఖులు మరియు సన్నిహితులు రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్లి పరామర్శించి నివాళులు అర్పిస్తున్నారు.

ఈ క్రమంలో టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాజేంద్ర ప్రసాద్ ని పరామర్శించారు. ఈ క్రమంలో కూకట్పల్లిలోని ఇందువిలాస్ లోని రాజేంద్రప్రసాద్‌ ఇంటికి వెళ్లి గాయత్రి చిత్రపటం వద్ద నివాళులు అర్పించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రభాస్ ని చూడగానే రాజేంద్ర ప్రసాద్ ఎమోషనల్ అయ్యాడు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ప్రభాస్‌ కల్కి 2, సాలార్ 2, స్పిరిట్ తదితర చిత్రాలలో నటిస్తున్నాడు. దీంతో డైలీ షూటింగ్ షెడ్యూల్ తో బిజిబిజీగా గడుపుతున్నాడు. ఇటీవలే ప్రభాస్, డైరెక్టర్ మారుతీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ది రాజా సాబ్ చిత్రంలోని మేకింగ్ వీడియొ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ది రాజా సాబ్ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ భావిస్తున్నారు. దీంతో త్వరగతిన షూటింగ్ కంప్లీట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Back to top button