
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- ఎన్నో ఏళ్లుగా మూవీ ప్రైవసీకి గురవుతూ ఒకవైపు డైరెక్టర్లతో పాటు మరోవైపు హీరోల అభిమానులు కూడా చాలా వరకు ఆగ్రహంగా ఉన్నారు. అయితే ఎట్టకేలకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ఐ బొమ్మ నిర్వాహకుడిని పట్టుకొని అరెస్ట్ చేయడమే కాకుండా నిన్న రాత్రి సమయంలో ఈ ఐ బొమ్మకు సంబంధించి ఏవైతే వెబ్ సైట్లు ఉన్నాయో వాటిని తక్షణమే బ్లాక్ చేశారు. దీంతో రాత్రి నుంచి సినిమాలు చూద్దామని చాలామంది ఆ వెబ్సైట్ను ఓపెన్ చేయగా అవి ఓపెన్ కాలేదు. ఇదే సైట్ లో 1x bet అనే బెట్టింగ్ యాప్ మరియు ఆన్లైన్ గేమింగ్ యాప్ ను నిర్వహకుడు అయినటువంటి ఇమ్మడి రవి అనే వ్యక్తి ప్రమోట్ చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించి అతన్ని విచారణ చేస్తున్నారు. సినిమాలు చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రమోషన్ వల్ల బెట్టింగ్ వైపు మళ్ళించడమే అతని పనిగా పెట్టుకున్నాడు అని.. ఇందుకోసం అతను భారీగా బెట్టింగ్ కంపెనీల నుంచి నిధులు కూడా తీసుకున్నట్లుగా సమాచారం. కాగా ఓటీడీలోకి విడుదలైన సినిమాలను వెంటనే పైరసీ చేసి తన వెబ్సైట్లో పెట్టుకుని ఎంతో డబ్బును సంపాదించాడు. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా ఆ తరువాత పూర్తిస్థాయిలో బెట్టింగ్ ప్రమోషన్లు కూడా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇంత వేగంగా ఎంతో డబ్బును ఖర్చుపెట్టి ఈ ఐ బొమ్మ ను పట్టుకున్నంత సులభంగా సైబర్ క్రైమ్ నేరగాలను కూడా అంతే త్వరగా పట్టుకుని వీలైనంత స్థాయిలో ఈ సైబర్ మోసాలను తగ్గించాలని చెప్తూ.. ఐ బొమ్మకు సపోర్ట్ చేస్తూనే పోలీసులకు విజ్ఞప్తులు చేస్తున్నారు.
Read also : కుమారుడి ఫస్ట్ బర్త్ డే.. ఫోటో షేర్ చేసిన రోహిత్ శర్మ
Read also : Kamakshi Bhaskerla: హీరోయిన్లు ఎందుకు అలాంటి పాత్రలు చేయకూడదు.. సవాలుగా తీసుకుని మరీ చేశా





