Homeక్రైమ్కులపెద్దతో గొడవ.. తోటి కులస్తుల చేతిలో వ్యక్తి దారుణ హత్య

కులపెద్దతో గొడవ.. తోటి కులస్తుల చేతిలో వ్యక్తి దారుణ హత్య

కులపెద్దతో జరిగిన గొడవ ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొంది. మహబూబాబాద్ జిల్లాలోని మడిపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ కార్యక్రమం సందర్భంగా కులపెద్ద యాకయ్యతో రమేష్ అనే వ్యక్తికి వివాదం జరిగినట్లు సమాచారం.

ఈ ఘటనతో ఆగ్రహించిన కొందరు తోటి కులస్తులు రమేష్‌పై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన రమేష్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.

ఘటన అనంతరం నిందితులు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు దారితీసిన కారణాలు, దాడిలో పాల్గొన్న వారి వివరాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

also read: Breaking : ఏసీబీ వలలో చందానగర్ ఎస్సై.. ఇద్దరు కానిస్టేబుళ్లు

తాజావార్తలు