Homeతెలంగాణపంజాబ్ లో ఎన్డీఏ...!

పంజాబ్ లో ఎన్డీఏ…!

  • చేతులు కలిపిన బిజెపి, అకాలిదళ్

  • ఆరేళ్ల తరువాత మళ్లీ కలయిక

క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్ : వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో అక్కడి రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. 2020లో వ్యవసాయ చట్టాల వివాదంతో విడిపోయిన పాత మిత్రులు భారతీయ జనతా పార్టీ, శిరోమణి అకాలిదళ్ ఆర్యల విరామం తర్వాత మళ్లీ చేతులు కలిపాయి. ఢిల్లీ వేదికగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్, అకాలిదళ్ అధినేత సుఖబీర్ సింగ్ బాదం కలిసి 2027 పంజాబ్ ఎన్నికల్లో తాము కలిసి పోటీ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇంతవరకు ఎన్నడూ హంగ్ అసెంబ్లీని చూడని పంజాబ్లో.. ఇప్పుడు అమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నాయి. బలహీనపడ్డ అకాలి దళ్, పట్టణ ప్రాంతాలకు పరిమితమైన బిజెపి కలిసి మూడో బలమైన ప్రత్యామ్నాయంగా అవతరించాలని భావిస్తున్నాయి.

ఓట్ల బదిలీ జరిగేనా…?

అయితే ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. కానీ అసలు సవాల్ ఓట్ల బదిలీ. గ్రామీణ నియోజకవర్గాల్లో బిజెపి ఓటర్లు అకాలిదళ్ అభ్యర్థులకు ఓటు వేస్తారా? పట్టణ ప్రాంతాల్లో సంప్రదాయ అకాలిదళ్ ఓటర్లు బిజెపి అభ్యర్థులకు మద్దతు ఇస్తారా? అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలవలేకపోయాయి. రెండింటికి కలిపి దాదాపు 32 శాతం ఓట్లు వచ్చాయి. ఈ లెక్కలే మళ్లీ వీరిని దగ్గర చేశాయి. దీనికి తోడు పంజాబ్ ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఎక్స్ ఫ్యాక్టర్ దళిత ఓటు బ్యాంక్, దేశంలోనే అత్యధికంగా 32 శాతం దళిత జనాభా ఉన్న పంజాబ్ లో.. వీరి ఓట్లు ఏ వైపు మొగ్గుచూపితే ఆ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. 2022 ఎన్నికల్లో 117 స్థానాలకు గాను ఏకంగా 92 సీట్లు గెలుచుకొని ఆప్ సునామీ సృష్టించింది. అయితే ఐదేళ్ల పాలన తర్వాత సహజంగానే ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటోంది.

తగ్గిన ఆప్ గ్రాఫ్…

ప్రధానంగా పంజాబ్లో శాంతిభద్రతల సమస్య, డ్రగ్స్ మహమ్మారి పూర్తిగా అదుపులోకి రాకపోవడం, మహిళలకు నేలకు ₹1000 ఇచ్చే హామీ అమలులో జాప్యం వంటివి ఆప్ గ్రాఫ్ ను కొంతమేర తగ్గించాయి. 2024 లోక్ సభ ఎన్నికల్లోను ఆప్ కేవలం మూడు సీట్లకే పరిమితం కావడం ఆ పార్టీకి గట్టి హెచ్చరికగా మారింది.

సంక్షేమ పథకాలు...

అయితే పంజాబ్ విషయంలో ఒక్క మాట మాత్రం నిజం. అక్కడ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అమలు చేస్తున్న 300 యూనిట్ల ఉచిత విద్యుత్, మొహల్లా క్లినిక్ లు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వంటి పథకాల వల్ల గ్రామీణ పేదలు, ముఖ్యంగా దళిత, మధ్యతరగతి వర్గాల్లో ఆప్ కు ఇప్పటికీ బలమైన పట్టు ఉంది. ఇప్పుడు బిజెపి, అకాలీ దళ్ పొత్తు కుదరడం వల్ల ఆప్ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్, ఎన్డీఏ కూటమి మధ్య చీలిపోయే అవకాశం ఉంది. అదే జరిగితే త్రిముఖ పోటీలో ఆ చీలిక ఆమ్ ఆద్మీ పార్టీకి మరోసారి కలిసి వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి పాత మిత్రుల కలయిక, దళిత ఓటర్ల తీర్పు, ఆప్ ప్రభుత్వ సంక్షేమ పథకాల మధ్య 2027 పంజాబ్ ఎన్నికలు అత్యంత ఉత్కంఠ భరితంగా సాగనున్నాయి.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1.  నిత్యావసరాల ధరలకు కళ్లెం.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!
  2. ఐపీఎల్ చరిత్రనే తిరగరాస్తాడు.. ఈ సారి రూ.40 కోట్లు పక్కా
  3.  చెడు వ్యసనాలకు దూరంగా ఉంటేనే ఉజ్వల భవిష్యత్తు: హీరో నిఖిల్
  4.  యువతకు 66 శాతం సీట్లు.. ఉగాది నుంచి పాదయాత్రకు సిద్ధం: విజయసాయిరెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు