Homeతెలంగాణవిశాఖ‌లో యువ‌తి అనుమానాస్ప‌ద మృతి....!

విశాఖ‌లో యువ‌తి అనుమానాస్ప‌ద మృతి….!

విశాఖ‌ప‌ట్నం, క్రైమ్‌మిర్ర‌ర్‌: విశాఖ‌న‌గ‌రంలో ఓ యువ‌తి అనుమానాస్ప‌దంగా మృతి చెందిన ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. పీఎంపాలెం క్రికెట్ స్టేడియం వద్ద హౌసింగ్ బోర్డు కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతిచెందిన యువతి త్రివేణి (20)గా గుర్తించారు. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

మన్యం జిల్లాకు చెందిన యువతి.. కొమ్మాదిలో నివాసం ఉంటోంది. రూమ్‌లో త్రివేణి ఒక్కరే ఉంటున్నట్లు సమాచారం. యువతి మృతిపై కేసు నమోదు చేసిన పీఎం పాలెం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. త్రివేణి మృతికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. యువతి అనుమానాస్పద మృతి స్థానికంగా సంచలనం రేపింది.

ఇవి కూడ చ‌ద‌వండి:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు