Homeఆంధ్ర ప్రదేశ్శ్రీ‌కాకుళం, కాకినాడ కార్పొరేషన్లపై వైసీపీ గురి...!

శ్రీ‌కాకుళం, కాకినాడ కార్పొరేషన్లపై వైసీపీ గురి…!

  • శ్రీకాకుళం బరిలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి

  • ఇటీవల టిడిపి నుంచి పార్టీలో చేరిక

  • కాకినాడ నుంచి ప్రముఖ వైద్యురాలు సత్య శ్రీ

  • జగన్ వ్యూహాత్మక ఎంపిక

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: మున్సిపల్ రెండో దశ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 23 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. అందులో భాగంగా నాలుగు కార్పొరేషన్లకు కూడా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అయితే తొలి విడతలో వైసిపి దారుణంగా ఓడిపోయింది. అందుకే ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నాలుగు కార్పొరేషన్ల లో రెండింటి పై గురి పెట్టింది. ప్రధానంగా శ్రీకాకుళం, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ లను కైవసం చేసుకోవాలని చూస్తోంది. అందులో భాగంగా గట్టి అభ్యర్థులను రంగంలోకి దించుతోంది. దీంతో పోరు ప్రతిష్టాత్మకంగా మారనుంది.

టిడిపి తో అనుబంధం తెంచుకొని…

శ్రీకాకుళం కార్పొరేషన్ కు సంబంధించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పేరును ప్రకటించింది హై కమాండ్. ఇటీవల ఆమె జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో సేవలందించిన గుండ కుటుంబం అనూహ్యంగా వైసీపీలో చేరింది. టిడిపిలో జరిగిన పరిణామాలతో కలత చెందిన మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి తన చిరకాల ప్రత్యర్థి ధర్మాన ప్రసాదరావు గూటికి చేరారు. శ్రీకాకుళం నగరంలో గుండ కుటుంబానికి మంచి పేరు ఉంది. అందుకే ఆమెను మేయర్గా ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలో దించి విజయం అందుకోవాలని చూస్తోంది వైసిపి. ఇక్కడ జనసేనకు మేయర్ అభ్యర్థిని ఖరారు చేసింది కూటమి. ఆ పార్టీ అభ్యర్థిగా ప్రముఖ వైద్యుడు దానేటి శ్రీధర్ భార్య రంగంలోకి దిగబోతున్నారు. ఇక్కడ పోటీ రసవత్తరంగా మారే అవకాశం ఉంది.

పార్టీలో చేరిన వెంటనే…

మరోవైపు కాకినాడ నుంచి సైతం గట్టి అభ్యర్థిని బరిలో దించాలని చూస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ప్రముఖ వైద్యుడు డాక్టర్ కాడ వెంకటరమణ భార్య సత్య శ్రీ ని వైసిపి ఎంపిక చేసింది. ఆ డాక్టర్ దంపతులు వైసీపీలో చేరిన వెంటనే ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. వాస్తవానికి కాకినాడ కార్పొరేషన్ లో వైసీపీ నుంచి చాలామంది ఆశావహులు ఉన్నారు. వారందరినీ పక్కనపెట్టి తటస్థులను రంగంలోకి దించడం ఆశ్చర్యపరిచింది. పార్టీతో సంబంధం లేని ఒక డాక్టర్ కుటుంబం నుంచి మేయర్ సీటుకు పోటీ పెడుతోంది.. సత్య శ్రీ ఇలా పార్టీలో చేరారో లేదో అలా మేయర్ అభ్యర్థిగా మారిపోయారు. సత్య శ్రీ ఎంపిక వెనుక మాజీ మంత్రి కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ముఖ్య పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. కాకినాడలో కూటమి బలం అధికం. పవన్ సొంత జిల్లా కావడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వ్యూహాత్మకంగా ఒక డాక్టర్ను రంగంలోకి దించుతోంది. మరి ఇందులో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

ఇవి కూడ చ‌ద‌వండి:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు