-
వంతల శాంతిని ఖరారు చేసిన జగన్
-
వైస్ చైర్మన్ గా రాంబాబు
-
ఎస్టీల్లో రెండు సామాజిక వర్గాలకు ప్రాధాన్యం
క్రైమ్ మిర్రర్, విశాఖపట్నం : ఏపీలో పరిషత్ పోరు ముగిసింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ ఓటమి ఎదురైంది. ముఖ్యంగా జిల్లా పరిషత్ స్థానాల్లో ఒక్కదానికి మాత్రమే పరిమితం అయింది. 28 జిల్లాలకు గాను అల్లూరి సీతారామరాజు జిల్లాను మాత్రమే వైసిపి దక్కించుకుంది. అక్కడ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా వంతల శాంతి పేరును జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అల్లూరి జిల్లా పార్టీ నాయకుల సమక్షంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. అల్లూరి జిల్లా పెదబయలు మండలం నుంచి జడ్పిటిసి గా శాంతి గెలుపొందారు. అలాగే జడ్పీ వైస్ చైర్మన్గా పాడేరు జడ్పిటిసి సభ్యుడు రాంబాబు పేరును ప్రకటించారు. తాడేపల్లి వెళ్లిన అల్లూరి జిల్లా నేతల సమక్షంలోనే జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.
వైసీపీకి పట్టు ఎక్కువ…
ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టు ఎక్కువ. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న పాడేరు, అరకు నియోజకవర్గాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టు ఎక్కువ. మొన్నటి ఎన్నికల్లో కూటమి ప్రభంజనం వీచింది. కానీ ఆ రెండు నియోజకవర్గాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇప్పుడు పరిషత్తు ఎన్నికల్లో కూడా అదే పట్టును కొనసాగించింది. అల్లూరి జిల్లాలోని 11 జడ్పిటిసి స్థానాలకు గాను ఏడు చోట్ల వైసీపీ గెలిచింది. తద్వారా వైసిపికి జడ్పీపీఠం కైవసం అయింది.
సామాజిక ఎంపిక…
కొత్త జడ్పీ చైర్పర్సన్ వంతల శాంతి ఎస్టి పోదు సామాజిక వర్గానికి చెందినవారు. అల్లూరి జిల్లాలోని అరకులోయ, పాడేరు, ముంచంగిపుట్టు మండలాల్లో వీరి జనాభా అధికం. అందుకే కీలకమైన చైర్పర్సన్ పదవిని ఆ సామాజిక వర్గానికి చెందిన మహిళ నేతను ఎంపిక చేశారు. ఇక కొండ దొర సామాజిక వర్గానికి చెందిన పాడేరు జడ్పిటిసి రాంబాబును వైస్ చైర్మన్ గా ఎంపిక చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం ఆయన పని చేశారు. వైసీపీకి దక్కిన ఏకైక జెడ్పి అల్లూరి సీతారామరాజు జిల్లా ది కావడంతో.. అక్కడ కొత్త పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ఆ పార్టీ నేతలు జగన్మోహన్ రెడ్డిని ప్రత్యేకంగా ఆహ్వానించారు.
ఇవి కూడ చదవండి:
-
ఇటలీలో మహేష్ బాబు మేనల్లుడి పెళ్లి వేడుకలు.. వైరల్ అవుతున్న ప్రీ వెడ్డింగ్ ఫొటోలు!
-
హైకోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం జగన్.. క్రిమినల్ కేసు కొట్టివేయాలని క్వాష్ పిటిషన్
-
డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు ‘ఇడుపు కాయితం’.. ప్రియదర్శి కొత్త సినిమా రిలీజ్ డేట్ ఖరారు!
-
రియల్ ఎస్టేట్లో నష్టాలు.. ఆర్థిక ఇబ్బందులతో వ్యాపారి ఆత్మహత్య
