-
ఇప్పటికే ఉన్న పార్టీ పేరు ప్రకటన
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: విజయసాయిరెడ్డి పార్టీ గతంలోనే రిజిస్టర్ అయిందా? పరివర్తన రాజనీతి పార్టీ గతంలోనే నమోదయిందా? ఇప్పుడు విజయసాయిరెడ్డి పార్టీ పేరు మార్చుకోక తప్పదా? పొలిటికల్ సర్కిల్లో దీనిపైనే చర్చి నడుస్తోంది. ఎన్నికల సంఘం వద్ద ఒక రాజకీయ పార్టీ రిజిస్టర్ అయి ఉండడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల సంఘం అధికారిక రికార్డులు, వార్షిక ఆడిట్ నివేదికల పత్రాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈసీ పత్రాల ప్రకారం పరివర్తన రాజనీతి పార్టీ 2022 లోనే అధికారికంగా నమోదు అయి ఉంది. న్యూఢిల్లీలోని మయూర్ విహార్ పేజ్ 2, ఈస్ట్ వినోద్ నగర్ చిరునామాతో రిజిస్టర్ అయిన ఆ పార్టీకి ముఖేష్ అనే వ్యక్తి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. 2025 నవంబర్ 12న ఆ పార్టీ తరఫున ఎన్నికల సంఘానికి వార్షిక ఆడిట్ నివేదికలు, ఐ టి ఆర్ 7, విరాళాల నివేదికలను కూడా సమర్పించినట్లు రసీదులతో సహా స్పష్టమవుతోంది. ఇటీవల జరిగిన 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి ఆరుముగం పోటీ చేసినట్లు కూడా ఈసీ రికార్డులు చెబుతున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా…
ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం దేశంలో ఒకసారి ఒక పేరుతో రాజకీయ పార్టీ రిజిస్టర్ అయి ఉంటే… అదే పేరుతో లేదా దానికి దగ్గరగా ఉండే పేరుతో మరొక కొత్త పార్టీని నమోదు చేసేందుకు ఈసీ అనుమతించదు. ఒకవేళ విజయసాయిరెడ్డి సదరు ఢిల్లీకి చెందిన ముఖేష్ నేతృత్వంలోని పాత పార్టీని టేకోవర్ చేసుకుని.. దాని బాధ్యతలు తీసుకుని ఉంటే తప్ప ఆయనకు స్వతంత్రంగా పరివర్తన రాజనీతి పార్టీ పేరు దక్కి అవకాశం లేదు. దశాబ్దాల పాటు చార్టెడ్ అకౌంటెంట్గా, రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తి.. కనీసం ఎన్నికల సంఘం వెబ్ సైట్ లో పేరు అందుబాటులో ఉందో లేదో సరి చూసుకోకుండానే 11-11-11 ముహూర్తం అంటూ పార్టీ పేరును ప్రకటించడం పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. చివరకు ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.
మెగాస్టార్ పిఆర్పి పేరుతో…
వాస్తవానికి విజయసాయిరెడ్డి పార్టీ పేరు పి ఆర్ పి అనేసరికి మెగాస్టార్ చిరంజీవి పాత పార్టీ పేరు గుర్తుకు వచ్చింది. కానీ పరివర్తన రాజకీయ పార్టీ అనేసరికి అసలు విషయం తెలిసింది. హిందుత్వ వాదానికి దగ్గరగా ఉండేలా ఆయన ఈ పేరు పెట్టుకున్నారు. కానీ ప్రారంభంలోనే ఎదురు దెబ్బ తగిలినట్లు అయింది. అయితే విజయసాయిరెడ్డి కొత్తగా పార్టీ ఏర్పాటు చేయబోతారా? మళ్లీ పేరు మార్చుతారా? అనేది చూడాలి. ఇప్పటికే పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు. ఈ పరిస్థితుల్లో అన్ని అధ్యయనం చేసి కొత్త పార్టీని ఏర్పాటు చేసి ఉంటారు. కానీ ఇప్పటికే రిజిస్టర్ అయిన పార్టీ పేరును పెట్టారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.
ఇవి కూడ చదవండి:
-
ఇటలీలో మహేష్ బాబు మేనల్లుడి పెళ్లి వేడుకలు.. వైరల్ అవుతున్న ప్రీ వెడ్డింగ్ ఫొటోలు!
-
హైకోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం జగన్.. క్రిమినల్ కేసు కొట్టివేయాలని క్వాష్ పిటిషన్
-
డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు ‘ఇడుపు కాయితం’.. ప్రియదర్శి కొత్త సినిమా రిలీజ్ డేట్ ఖరారు!
-
రియల్ ఎస్టేట్లో నష్టాలు.. ఆర్థిక ఇబ్బందులతో వ్యాపారి ఆత్మహత్య
