Homeతెలంగాణపోలీస్ శాఖ భారీ ప్రక్షాళన...!

పోలీస్ శాఖ భారీ ప్రక్షాళన…!

  • హైదరాబాద్ సిపి సజ్జనార్ బదిలీ

  • అక్కున సబర్వాల్ కు కీలక పోస్టింగ్

  • తెలంగాణ ప్రభుత్వం దూకుడుగా నిర్ణయాలు

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ పోలీస్ శాఖలో భారీ ప్రక్షాళన. రేవంత్ సర్కార్ అనూహ్యమైన రీతిలో నిర్ణయాలు తీసుకుంది. ఒకేసారి 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానంగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ కు షాక్ తప్పలేదు. అత్యంత కీలకమైన పోస్టులో కొనసాగుతున్న ఆయనను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. ప్రాధాన్యత తక్కువగా ఉండే తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ గా బదిలీ చేశారు. అదనంగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ బాధ్యతలను అప్పగించారు. అయితే సజ్జనార్ వంటి కీలక అధికారిని లూప్ లైన్ తరహా విభాగానికి పంపడం వెనుక ప్రభుత్వ అంతర్గత వ్యూహాలు బలంగా పనిచేశాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మురళి భగవత్ కు కమిషనర్ బాధ్యతలు…

ఈ బదిలీల్లో మరో కీలక పరిణామం. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న 2001 బ్యాచ్ అధికారి అక్కున సబర్వాల్ కు ప్రభుత్వం అత్యంత కీలకమైన పవర్ఫుల్ పోస్టింగ్ ఇచ్చింది. ప్రాధాన్యతను చాటుకుంది. సబర్వాల్ ను రాష్ట్ర శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీగా నియమించడంతోపాటు కోఆర్డినేషన్, టెక్నికల్ సర్వీసెస్ విభాగాల అదనపు బాధ్యతలను కూడా అప్పగించింది. ఇక సజ్జనార్ స్థానంలో కొత్త హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా 1995 బ్యాచ్ సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ మురళీధర్ భగవత్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆయన శాంతిభద్రతల విభాగం డిజిపిగా పనిచేశారు. గతంలో రాచకొండ కమిషనర్ గా సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది.

నియామకాలు ఇలా…

పోలీస్ శాఖలో ప్రక్షాళనలో భాగంగా అవినీతి నిరోధక శాఖ, నిఘా, ఆర్టీసీ, పౌరసరఫరాల విభాగాల్లోనూ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. సీనియర్ మహిళా ఐపీఎస్ అధికారిని చారు సిన్హాను పూర్తిస్థాయి ఏసీబీ బిజీగా నియమిస్తూనే సిఐడి డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు కొనసాగించింది. మల్టీ జోన్ 18 గా ఉన్న చంద్రశేఖర్ రెడ్డిని ఏసీబీ డైరెక్టర్గా బదిలీ చేసింది. గ్రేహౌండ్స్ ఆపరేషన్ డిజిపిగా ఉన్న డాక్టర్ అనిల్ కుమార్ టి జి ఎస్ ఆర్ టి సి ఎండి గా నియమించింది. ఆర్టీసీ ఎండీ గా ఉన్న నాగిరెడ్డిని పౌరసరఫరాల శాఖ కమిషనర్ గా మార్చింది. సివిల్ సప్లై కమిషనర్ గా ఉన్న స్టీఫెన్ రవీంద్రను కొత్తగా ఏర్పాటు అయిన తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్డు అండ్ రాయల్ సేఫ్టీ బ్యూరో డైరెక్టర్గా నిర్మించింది. మహిళా భద్రత విభాగం డిజిపిగా డాక్టర్ సౌమ్య మిశ్రా, జైల శాఖ డీజీగా స్వాతి లక్రా నియమితులయ్యారు.

పోలీస్ శాఖ పై పూర్తి పట్టు…

ఇంకోవైపు గ్రేహౌండ్స్ డీజీగా విక్రమ్ సింగ్ మాన్, మల్టీ జోన్ వన్ ఐజిగా కార్తికేయ వంటి సమర్థులైన అధికారులను కీలక స్థానాల్లో నియమించడం ద్వారా రేవంత్ సర్కార్ పోలీస్ వ్యవస్థపై తన పట్టును మరింత బిగించినట్లు అయింది. త్వరలో జరగబోయే పాలనాపరమైన కార్యక్రమాలు, క్షేత్రస్థాయి పర్యటన నేపథ్యంలోనే ఈ భారీ మార్పులకు శ్రీకారం చుట్టినట్లు స్పష్టమవుతుంది. కొందరు అధికారులకు లూప్ లైన్ పోస్టింగులతో షాక్ ఇస్తూనే.. అకుల్ సబర్వాల్, మహేష్ భగవత్ వంటి కీలక అధికారులకు కీలకమైన బాధ్యతలు అప్పగించడం ద్వారా రాష్ట్రంలో శాంతిభద్రతలు, అవినీతి నిరోధక చర్యలు ప్రభుత్వం సరికొత్త వేగాన్ని ఆశిస్తోందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

ఇవి కూడ చ‌ద‌వండి:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు