Homeక్రైమ్కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు దుర్మరణం

కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు దుర్మరణం

క్రైమ్ మిర్రర్ : సూర్యాపేట జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కోదాడ పరిధిలోని తుమ్మర గ్రామం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. వ్యాన్, ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

పోలీసుల సమాచారం ప్రకారం.. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులను వేగంగా వచ్చిన వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే మృతి చెందారు. ప్రమాదాన్ని గమనించిన ఇతర వాహనదారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను సేకరించారు. మృతులు అనంతగిరి మండలం కొత్తగూడెం గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.
also read : కర్ణాటకలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు