Homeక్రైమ్కర్ణాటకలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

కర్ణాటకలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

క్రైమ్ మిర్రర్ : కర్ణాటక రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదం నాలుగు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. నిర్మాణ పనులు కొనసాగుతున్న వంతెన వద్ద కారు అదుపుతప్పి ఢీకొనడంతో నలుగురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన షాహాపూర్ సమీపంలోని ఇబ్రహీంపూర్ వద్ద సూరత్–చెన్నై ఎక్స్‌ప్రెస్‌వేపై ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరి జిల్లాకు చెందిన నలుగురు వ్యక్తులు మహారాష్ట్రలోని తుల్జా భవాని అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో కారు వేగాన్ని అదుపు చేయలేకపోవడంతో నిర్మాణంలో ఉన్న వంతెనను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు.

ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మరణించిన వారిని గురురాజ్ సురేశ్ చవాన్ (29), రెడ్డి బగ్లా రాథోడ్ (33), గోవింద సీత్యా చవాన్ (28), కుమార్ రామ్ రాథోడ్ (26)గా గుర్తించారు. ఈ ఘటనపై షాహాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.
also read : తల్లి మృతదేహం వద్దే రాత్రంతా రోదించిన మూడేళ్ల బాలుడు.. ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు