లక్నో, క్రైమ్‌మిర్రర్: పఆములు అప్పుడప్పుడు అనుకోకుండా జనావాసాల్లో వస్తుంటాయి. కాని ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఆ ఇంట్లోకి తరుచుగా పాములు వస్తున్నాయి. గడిచిన వారం రోజుల్లోనే సుమారు 30పైకిగా పాములు వచ్చాయి. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ర్టంలోని భాగ్‌వత్ జిల్లా కహార్కా గ్రామంలో ఈ వింత ఘటన జరుగుతుంది. పాములు ఎక్కడ పడితే అక్కడ గుడ్లు పెడుతున్నాయి. వి చిత్రం జరుగుతున్నప్పటికీ ఇంటిలోని యజమానితో పాటు ఇరుగుపొరుగు వారు మాత్రం భయాందోళనకు గురవుతున్నారు.
ఎనిమిదేండ్లుగా పాములు వస్తున్నాయి…
కాగా కపిల్ త్యాగి అనే ఆ వ్యక్తి ఇంట్లోకి గడిచిన ఎనిమిదేండ్ల నుంచి తరచూగా పాములు వస్తున్నాయి. గత వారం రోజులుగా వాటి సంఖ్య బాగా పెరిగింది. ఏడు రోజుల్లోనే సుమారు 30 పాములు వచ్చాయి. అటవీ సిబ్బంది వాటిని పట్టుకుని అడవిలో విడిచిపెట్టారు. ఇవన్నీ నాగుపాములు కావడంతో కపిల్ తన నివాసాన్ని తవ్వించాలనే నిర్ణయానికి వచ్చారు. అలా తవ్వుతుండగా ఇంటి పరిసరాల్లో దాదాపు 100 పాముగుడ్లు బయటపడ్డాయి. ఈ క్రమంలో కపిల్ కుటుంబం భయంతో రాత్రిళ్లు నిద్రకూడా సరిగా పోకుండా బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. ఈ ఇంటిని జిల్లా అటవీ అధికారి వినోద్ కుమార్ పరిశీలించారు. తాము అండగా ఉంటామని హామీ ఇస్తూనే అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇవి కూడ చదవండి:
-
రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు…! భాగ్యనగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు…
-
కాంగ్రెస్ పోరాటాలు నిష్ఫలం…!
-
పులివెందులలో హై అలెర్ట్…!
-
నెత్తుటి సంస్కృతి…! పాఠశాల ప్రాంగణంలోకి క్రూరత్వం..
