Homeఆంధ్ర ప్రదేశ్పులివెందులలో హై అలెర్ట్...!

పులివెందులలో హై అలెర్ట్…!

  • జగన్ వర్సెస్ దస్తగిరి

  • మీ వల్ల మా బతుకులు పోయాయంటూ వివేకా హత్య కేసు నిందితుడి ఆవేదన

  • రీపోలింగ్ కు జగన్మోహన్ రెడ్డి డిమాండ్

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకున్నాయి. ప్రధానంగా పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో కీలక పరిణామాలు జరిగాయి. జగన్ పులివెందుల పర్యటన విషయంలో పోలీసులు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఆయన ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో పులివెందులకు చేరుకున్నారు. అయితే ఆయన పర్యటన ప్రారంభంలోనే అనూహ్య పరిణామాలు చోటుచేసుకుని ఉద్రిక్తతకు దారితీసాయి. జగన్ హెలికాప్టర్ సాఫీగానే ల్యాండ్ అయింది. కానీ అధికారులు ఒప్పుకోలేదని హడావిడి చేశారు. ఎమర్జెన్సీ లాండింగ్ పేరుతో కుట్రలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు హెలికాప్టర్ దిగిన జగన్ రోడ్డు షో మాదిరిగా ముందుకు సాగారు. ఈ క్రమంలో అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నాయి.

కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం…

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దస్తగిరి ఒక నిందితుడు. అయితే ఆయన అప్రూవర్గా మారారు. పులివెందులలో రోడ్డు షో గా వస్తున్న జగన్మోహన్ రెడ్డి కి ఎదురు వెళ్లే ప్రయత్నం చేశారు. ఆయన కాన్వాయ్ కు అడ్డుపడి మా జీవితాలను నాశనం చేశావు అంటూ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి దస్తగిరి బిగ్గరగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దస్తగిరి రాకను గమనించిన సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు తక్షణమే అప్రమత్తమై ఆయనను అడ్డుకోగా.. జగన్ ఆ దృశ్యాలను చూసి చూడనట్లుగా ముందుకు వెళ్లిపోయారు. కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. 18వ వార్డు ఎర్రగుడిపల్లి పోలింగ్ బూత్ సమీపంలో వైసిపి, టిడిపి వర్గాల మధ్య తోపులాట జరిగింది. రాళ్లదాడి జరగడంతో ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టారు. కొన్నిచోట్ల చిన్నపాటి ఘర్షణలు, వాహనాలకు నిప్పు పెట్టిన ఘటనలు మినహా మధ్యాహ్నం వరకు పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో పోలింగ్ ప్రక్రియ సాధారణంగానే సాగింది.

రీ పోలింగ్ కావాలని డిమాండ్…

పులివెందుల మున్సిపాలిటీలో ఓటు వేసేందుకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ ప్రారంభం అయిన తరువాత రీపోలింగ్కు ఆయన డిమాండ్ చేశారు. ఇది రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. మొత్తం 80 పోలింగ్ బూత్ లు ఉంటే.. 70 బూత్ లలో తమ పార్టీ ఏజెంట్లు లేరని జగన్ స్వయంగా వచ్చారు. ఓటర్లను పోలీసులు వెనక్కి పంపిస్తున్నారని.. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆయన చేసిన ఆరోపణలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మరోవైపు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది పోలీసు యంత్రాంగం. కేంద్ర పారా మిలటరీ బలగాలు, రాష్ట్ర పోలీసుల పర్యవేక్షణతో పాటు ప్రతి పోలింగ్ బూత్ లోను సీసీ కెమెరాల రికార్డింగ్, లైవ్ వెబ్ కాస్టింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అయితే జగన్ రీపోలింగ్కు డిమాండ్ చేయడంతో అక్కడ ముందే ఓటమి అని అంగీకరించినట్లు అయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1.   జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు పోరాటం ఆపం.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు!
  2.  సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు రాహుల్ గాంధీ వార్నింగ్.. నెక్స్ట్ మోదీ, అమిత్ షానే అంటూ వ్యాఖ్యలు!
  3.  హింసకు సినిమాలే కారణమా? రాప్తాడు ఘటనపై రామ్‌గోపాల్‌ వర్మ సంచలన వ్యాఖ్యలు
  4.  శాతవాహన విశ్వవిద్యాలయంలో విషాదం.. ఎల్‌ఎల్‌బీ విద్యార్థిని మృతి

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు