Homeక్రైమ్మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదని తండ్రిని గొడ్డలితో నరికి చంపిన కొడుకు.. నల్గొండలో దారుణం!

మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదని తండ్రిని గొడ్డలితో నరికి చంపిన కొడుకు.. నల్గొండలో దారుణం!

తెలంగాణలోని నల్గొండ పట్టణంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఓ వ్యక్తి కన్నతండ్రినే అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. హనుమాన్ నగర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

వివరాల్లోకి వెళ్తే.. హనుమాన్ నగర్‌కు చెందిన 35 ఏళ్ల గణేశ్ మద్యం సేవించేందుకు తన తండ్రి లింగయ్య (70)ను డబ్బులు అడిగాడు. అయితే డబ్బులు ఇచ్చేందుకు తండ్రి నిరాకరించడంతో ఇద్దరి మధ్య వివాదం తలెత్తినట్లు సమాచారం. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన గణేశ్ గొడ్డలితో తండ్రిపై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన లింగయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే హనుమాన్ నగర్‌కు చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మద్యం కోసం కన్నతండ్రినే హత్య చేసిన ఘటనతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

also read:  వికారాబాద్ జిల్లాలో విషాదం.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు