Homeతెలంగాణరిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎన్.బాలసుబ్రహ్మణ్యం ఇక లేరు...! చికిత్స పొందుతూ అమెరికాలో మృతి...

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎన్.బాలసుబ్రహ్మణ్యం ఇక లేరు…! చికిత్స పొందుతూ అమెరికాలో మృతి…

అమ‌రావ‌తి, క్రైమ్‌మిర్ర‌ర్‌: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎన్.బాలసుబ్రహ్మణ్యం గ‌త కొన్నేళ్లుగా ప్యాంక్రియాటిక్ క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో అమెరికాలో చికిత్స పొందుతూ అమెరికాలో శుక్ర‌వారం తెల్ల‌వారుజామున 5గంట‌ల‌కు ఆయ‌న తుదిశ్వాస విడిచారు. కాగా ఏపీఎస్ ఆర్టీసి ఎండీగా ప‌ని చేస్తూ ఈ ఏడాది ఆగ‌స్టు 31న ఉద్యోగ విర‌మ‌ణ చేశారు. ఆయ‌న రాష్ర్టంలోని ప‌లు జిల్లాల్లో ఎస్పీగా కూడ సేవ‌లందించారు.

బాల‌సుబ్ర‌మ‌ణ్యం మృతి ప‌ట్ల సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి…

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రమణ్యం మృతిపట్ల సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు నాయుడు బాలసుబ్రమణ్యం మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబ సభ్యులు, సహచరులకు సానుభూతి తెలిపారు. నిజాయితీ, అంకితభావం, గట్టి నిర్ణయాలు తీసుకోగల సమర్థవంతమైన అధికారిగా బాలసుబ్రమణ్యం గుర్తింపు పొందారన్నారు. పోలీస్, ఇంటెలిజెన్స్, రవాణా, ప్రజా పాలన విభాగాల్లో ఆయన అందించిన సేవలను ముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు. పాలనలో నూతన ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఆయన కృషి చేశారని తెలిపారు. తీవ్ర అనారోగ్యంతో ధైర్యంగా పోరాడి బాలసుబ్రమణ్యం కన్నుమూశారని, ఆయన అందించిన సేవలు పోలీస్ రంగానికి ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. కాంగ్రెస్ స‌ర్కార్‌ను కూల్చ‌డ‌మే ల‌క్ష్యం….! ఈటెల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు…
  2.  దారుణం…త‌ల్లి చేతిలో కుమార్తె హ‌త్యా…! ఆ ప్రాంతంలో క‌ల‌క‌లం…
  3.  అమెరికా-ర‌ష్యా కీల‌క ఒప్పందాలు…?
  4.  పిల్లల కళ్లెదుటే భార్యను గొడ్డలితో హత్య చేసిన భర్త.. ఆపై పెద్ద కుమారుడితో పరారీ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు