Homeతెలంగాణకాంగ్రెస్ స‌ర్కార్‌ను కూల్చ‌డ‌మే ల‌క్ష్యం....! ఈటెల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు...

కాంగ్రెస్ స‌ర్కార్‌ను కూల్చ‌డ‌మే ల‌క్ష్యం….! ఈటెల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు…

హైద‌రాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: రేవంత్ స‌ర్కార్‌ను కూల్చే వ‌ర‌కు తిరుగుతాన‌ని ఈటెల రాజేంద‌ర్ స్ప‌ష్టం చేశారు. జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్ డంపింగ్ యార్డును త‌ర‌లించాలంటూ చేప‌ట్టిన ఈటెల రాజేంద‌ర్ పాద‌యాత్ర‌కు విశేష స్పంద‌న ల‌భిస్తోంది. ఈ సంద‌ర్భంగా పాద‌యాత్ర‌లో ఎంపీ ఈటెల రాజేంద‌ర్ రేవంత్ స‌ర్కార్‌పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ స‌ర్కార్‌ను కూల్చే వ‌ర‌కు ఊరుకునేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో రాష్ర్ట వ్యాప్తంగా ఈటెల పాద‌యాత్ర సంచ‌ల‌నంగా మారింది. డంపింగ్ యార్డు తీసేయాల‌ని పాద‌యాత్ర చేస్తుంటే ఈటెల రాజేంద‌ర్ ప‌ని లేక తిరుగుత‌న్నార‌ని కాంగ్రెస్ నాయ‌కులు అంటున్నార‌ట‌… ఈ డంపింగ్ యార్డును కూల్చేవ‌ర‌కే కాదు పాద‌యాత్ర‌…మీ కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చేవ‌ర‌కు తిరుగుతాన‌ని పేర్కొన్నారు. జవహర్‌నగర్ డంపింగ్ యార్డు రీసైకిల్ కోసం ఎంత ఖర్చవుతుందో డీపీఆర్ చేసి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంపీ కోరారు. ప్రధాని నరేంద్ర నరేంద్ర మోదీని ఒప్పించి అవసరమైన డబ్బులను తీసుకొస్తామని ప్రకటించారు. అలా తీసుకురాలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా అంటూ ఎంపీ ఈటల రాజేందర్ ఛాలెంజ్ విసిరారు.

శ్రీ‌రంగ‌నాథ స్వామి ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు…

జవహర్‌ నగర్ డంపింగ్ యార్డ్‌ను తరలించాలంటూ ఈనెల 27న ఏదులాబాద్‌లోని శ్రీరంగనాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎంపీ ఈటల రాజేందర్ పాదయాత్రను మొదలుపెట్టారు. ఈ డంపింగ్ యార్డు వల్ల వెలువడే కాలుష్యంతో చుట్టుపక్కల గ్రామాలు, కాలనీల ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోందని తెలిపారు. గాలి, భూగర్భ జలాలు కలుషితమయ్యాయని.. వెంటనే డంపింగ్ యార్డును తొలగించాలని ఎంపీ డిమాండ్ చేశారు. కాగా ఈటెల రాజేంద‌ర్ పాద‌యాత్ర‌కు విశేష స్పంద‌న ల‌భిస్తోంది. ప్ర‌జ‌ల నుంచి మ‌ద్ద‌తు ల‌భించ‌డంతో ఈటెలు ముందుకు సాగుతున్నారు. రాను రాను ఈ పాద‌యాత్ర ఏ వైపు తిరుగుతోంద‌న‌ని కాంగ్రెస్ శ్రేణుల్లో అల‌జ‌డి నెల‌కొంది.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1.  హైదరాబాద్‌లో స్వీట్ తయారీ కేంద్రాలపై దాడులు.. 3,546 కిలోల ఆహార పదార్థాలు ధ్వంసం!
  2. రణబీర్ కపూర్ ‘రామాయణం’పై భారీ అంచనాలు.. నవంబర్ 5న గ్రాండ్ రిలీజ్!
  3. ప్రముఖ నిర్మాత చలసాని వెంకటేశ్వరరావు కన్నుమూత.. టాలీవుడ్‌లో విషాదం
  4.  ఉక్రెయిన్‌లో రైల్వే స్టేషన్‌పై డ్రోన్ దాడి.. 13 మంది మృతి!

 

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు