రంగారెడ్డి, క్రైమ్‌మిర్రర్: సెల్‌ఫోన్ వివాదం కన్న కూతురి ప్రాణాలు తీసిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చేసుకుంది. సెల్‌ఫోన్‌ను ఎక్కువగా వాడుతుందన్న కోపంతో కన్నతల్లి కూతురు గొంతు నులిమి చంపేసిన దారుణ ఘటన కొత్తూరు పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. హనుమాన్ టెంపుల్ కాలనీలో నివసించే ముయ్యాది రాజు, విజయలక్ష్మి (34) దంపతులకు సువర్ణ అలియాస్ లవ్లీ (14) అనే కుమార్తె ఉంది. ఆమె తొమ్మిదో తరగతి చదువుతోంది. అయితే.. సువర్ణ నిత్యం మొబైల్ ఫోన్‌లోనే గడుపుతుండటంతో తల్లి విజయలక్ష్మి పలుమార్లు మందలించేది. ఈ విషయమై తల్లీకూతుళ్ల మధ్య తరచూ గొడవలు జరిగేవి.
ఈ క్రమంలో అక్టోబర్ 27న మరోసారి ఫోన్ వాడకంపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన విజయలక్ష్మి కుమార్తె గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. కాగా కుమార్తెను హత్య చేసిన అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు విజయలక్ష్మీ మరో నాటకానికి తెరలేపింది. బాలిక మెడకు చీర చుట్టి ఆత్మహత్య చేసకున్నట్లు నమ్మించింది కాని పోస్టు మార్టు నివేదికలో మాత్రం గొంతు నులిమి చంపేసినట్లు తేలడంతో పోలీసులు అనుమానించారు. దీంతో పోలీసులు విజయ లక్ష్మిని విచారించారు. దీంతో సెల్‌ఫోన్ ఎక్కువగా వాడుతుందన్న కోపంతోనే కుమార్తెను హత్య చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో పోలీసులు విజయలక్ష్మిని కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు.
ఇవి కూడ చదవండి:
-
ChatGPT వైద్య సలహాతో తమ కుమార్తె మృతి చెందిందంటూ OpenAIపై తల్లిదండ్రుల సంచలన దావా!
-
పేద విద్యార్థుల కోసం ధనుష్ కీలక నిర్ణయం.. 234 నియోజకవర్గాల్లో ఉచిత ఏసీ ట్యూషన్ సెంటర్లు!
-
‘మూకుత్తి అమ్మన్ 2’లో రెజీనా విలనిజం.. నయనతారతో ఫైట్ సీన్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు!
-
హైదరాబాద్‌లో స్వీట్ తయారీ కేంద్రాలపై దాడులు.. 3,546 కిలోల ఆహార పదార్థాలు ధ్వంసం!
