Homeతెలంగాణకెసిఆర్ థర్డ్ ఫ్రంట్...!

కెసిఆర్ థర్డ్ ఫ్రంట్…!

  • జగన్ తో కలిసి మూడో ప్రత్యామ్నాయం

  • మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, నవీన్ భాగస్వామ్యంతో అడుగులు

  • గతంలోనూ ప్రయత్నించి విఫలం

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : కెసిఆర్ మళ్లీ జాతీయ రాజకీయ బాట పడతారా? బిజెపి, కాంగ్రెస్కు వ్యతిరేక కూటమి కడతారా? అలా చెబుతున్న కేటీఆర్ మాటల్లో నిజం ఎంత? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. కెసిఆర్ మళ్లీ జాతీయస్థాయిలో చక్రం తిప్పుతారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో చర్చకు దారితీస్తున్నాయి. దేశ రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిని రేపుతున్నాయి. దీని వెనుక తెరపైకి వస్తున్న సరికొత్త రాజకీయ సమీకరణం ఒక్క గులాబీ పార్టీ ఎత్తుగడ మాత్రమే కాదని తెలుస్తోంది. ఏపీలో వైయస్సార్సీపీతో కలిపి ఉమ్మడి ఎత్తుగడగా సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయి.. అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు కెసిఆర్, జగన్ లు. ఇప్పుడు ఇద్దరూ కలిసి మళ్లీ థర్డ్ ఫ్రంట్ నినాదాన్ని భుజానికి ఎత్తుకోవాలని అంతర్గతంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

శాశ్వత మిత్రులు…
.
వాస్తవానికి కెసిఆర్, జగన్ లు శాశ్వత రాజకీయ మిత్రులుగా మారిపోయారు. అయితే రాజకీయ సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. జాతీయస్థాయిలో కూడా వారికి బలహీనతలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని విభేదిస్తున్నారు. అలాగని బిజెపితో నేరుగా కలవలేరు. అందుకే ఆ బలహీనతలే వారిని ఒకే గొడుగు కిందకు తెచ్చేలా చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏపీలో ఎన్డీఏ కూటమిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అలాగని కాంగ్రెస్ వైపు అడుగు వేసే పరిస్థితి లేదు. సోనియా గాంధీతో ఉన్న పాత వైరం, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్న సొంత చెల్లెలు షర్మిల తో ఉన్న రాజకీయ, కుటుంబ విభేదాల దృష్ట్యా ఇండియా కూటమి తలుపులు తీర్చుకోకపోవచ్చు. తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ చేతిలో అధికారం కోల్పోయారు కేసీఆర్. అందుకే కెసిఆర్ తో జతకట్టే ప్రశ్న లేదు. ఇలా రాజకీయంగా సతమతం అవుతున్న ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల ఎదుట మూడో ఫ్రంట్ ఏర్పాటు అనేది ఒక తాత్కాలిక రక్షణ కవచంగా కనిపిస్తోంది.

పాత పరిచయాలతో…

కెసిఆర్ తనకు ఉన్న పాత పరిచయాలతో మూడో ఫ్రంట్ దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, నవీన్ పట్నాయక్ లాంటి బలమైన ప్రాంతీయ పార్టీల అధినేతలతో మళ్లీ టచ్ లోకి వెళ్లేందుకు కేసిఆర్ రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మమతా బెనర్జీతో పాటు అఖిలేష్ యాదవ్ సైతం కాంగ్రెస్ పెత్తనాన్ని పూర్తిగా అంగీకరించే పరిస్థితి లేదు. ఒడిస్సాలో బిజెపి వంటరి పోరాటంతో తటస్థ వైఖరిని అనుసరిస్తున్నారు నవీన్ పట్నాయక్. అందుకే కెసిఆర్ జగన్ మోహన్ రెడ్డితో కలుపు కెళ్ళి మిగతా నేతలతో కలిసి మూడో ఫ్రంట్ ఏర్పాటు చేస్తారని ప్రచారం నడుస్తోంది. 2023లో ఇటువంటి ప్రయత్నం చేసిన కేసీఆర్ దారుణంగా దెబ్బతిన్నారు. మరి ఇప్పుడు ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.

ఇవి కూడ చ‌ద‌వండి:

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు