Homeఆంధ్ర ప్రదేశ్'గ్రేటర్' ఎవరిదో...? విశాఖ మేయర్ పీఠం ప్రతిష్టాత్మకం...

‘గ్రేటర్’ ఎవరిదో…? విశాఖ మేయర్ పీఠం ప్రతిష్టాత్మకం…

  • సానుకూల అంశాలతో ముందు వరుసలో కూటమి

  • గట్టిగానే వైసిపి పోరాటం

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: రాష్ట్రంలోనే అతిపెద్ద కార్పొరేషన్ గ్రేటర్ విశాఖ. ప్రస్తుతం అక్కడ మినీ సార్వత్రిక సమరాన్ని తలపిస్తోంది పోరాటం. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక ఉత్కంఠను రేపుతోంది. ఏపీ ఆర్థిక రాజధానిగా, పరిపాలన ముఖచిత్రంలో అత్యంత కీలక నగరంగా ఉంది. అందుకే అక్కడ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడం ఉభయపక్షాలకు అత్యంత ప్రతిష్టాత్మకం. ప్రస్తుతం పోటీలో స్వతంత్రులతో కలిపి దాదాపు 15 మంది ఉన్నారు. క్షేత్రస్థాయి పోటీ మాత్రం అధికార కూటమి బలపరిచిన టిడిపి అభ్యర్థి ముక్కా శ్రావణి, వైసిపి తరఫున నిలిచిన వరుదు కళ్యాణి మధ్యనే నేరుగా కేంద్రీకృతం అయింది.

టిడిపికి కంచుకోట…

విశాఖలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తే మాత్రం అధికార కూటమికి అనుకూల పరిస్థితి కనిపిస్తోంది. విశాఖ నగరం ఆది నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోట. 2019లో రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సునామీ సృష్టించింది. కానీ ఆ సమయంలో మాత్రం నగరంలోని నాలుగు నియోజకవర్గాల్లో టిడిపి ఘనవిజయం సాధించింది. మొన్న సార్వత్రిక ఎన్నికల్లోనూ నగరంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు విశాఖ ఎంపీ స్థానాన్ని కూటమి రికార్డు మెజారిటీతో క్లీన్ స్లీప్ చేసింది. నగర పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు కూటమినేతలే కావడం.. రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలో ఉండడం అధికారిక యంత్రాంగాన్ని, క్షేత్రస్థాయి ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి కూటమి అభ్యర్థి శ్రావణి కి తిరుగులేని అదనపు బలం.

ఏకతాటి పైకి కూటమి…

మేయర్ అభ్యర్థిత్వం కోసం కూటమిలోని మూడు పార్టీలు పోటీపడ్డాయి. డజన్ మంది వరకు ఆశావహులు బయటకు వచ్చారు. కానీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా ఈ సీటును టిడిపికి ఇచ్చారు. ఈ క్రమంలో మూడు పార్టీల హై కమాండ్లు హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో నేతలంతా ఏకతాటిపైకి వచ్చి సమిష్టిగా ప్రచారం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ చర్యలు, రైల్వే జోన్ వేగవంతం, నగరంలో మౌలిక సదుపాయాల కల్పనా వంటివి కూటమి ప్రభుత్వ అభివృద్ధి అజెండాను బలంగా ప్రచారం చేస్తూ అర్బన్ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

ఒంటరి పోరాటం…

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి రంగంలోకి దించింది. అయితే ఆమె ఒంటరి పోరాటం చేస్తున్నారు. గత పాలకమండలిలో తమకున్న కార్పొరేటర్ల బలం, కిందిస్థాయి సంబంధాలు తమకు రక్షణగా నిలుస్తాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఎమ్మెల్సీగా, మహిళా విభాగం అధ్యక్షురాలిగా నగరంలో వరుదు కళ్యాణి ఎంతో సుపరిచితం. మంచి వాగ్దాటితోపాటు అనుభవం కలిగిన మహిళ నాయకురాలుగా ఆమెకు సానుకూల అంశాలు ఉన్నాయి. నగరంలో తాగునీటి ఎద్దడి, నిత్యవసరాల ధరల పెరుగుదల, కూటమిపాలనలో వైఫల్యాలను ఎత్తిచూపుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తోంది. ఓటమి అభ్యర్థికి అనుభవం తక్కువ అని.. వారసత్వ రాజకీయాల్లో భాగంగానే ఆమెకు టికెట్ వచ్చిందని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయితే ఆ పార్టీకి సీనియర్ల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీ అభ్యర్థికి అండగా నిలిచి.. గెలుపు కోసం కృషి చేసే సీనియర్లు లేకుండా పోతున్నారు. అధినేత జగన్ కేవలం తాడేపల్లి, బెంగళూరులో కు మాత్రమే పరిమితం అవుతున్నారు. స్థానిక మాజీ మంత్రులు కూడా చేతులెత్తేసారు. అందుకే వైసిపి ఒంటరి పోరాటం చేస్తోంది. అందరూ వద్దంటేనే చివరికి వరుదు కళ్యాణి పై ఒత్తిడి తెచ్చి పోటీలో పెట్టారు. పార్టీ నిర్ణయంతో కళ్యాణి కూడా రంగంలోకి దిగారు. కానీ విశాఖ నేతలు ఎవరు సీరియస్ గా కళ్యాణి కోసం పనిచేయడం లేదు. ఆమె గట్టి పోటీ ఇస్తే విశాఖలో స్ట్రాంగ్ లీడర్ గా మారిపోతారన్న ఆందోళన మిగతా నాయకుల్లో ఉంది. అందుకే సహాయ నిరాకరణ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే విశాఖలో కూటమికి అనుకూలత కనిపిస్తోంది.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. రేవంత్ ది భయమా? జాగ్రత్తా…?… సీఎం నోట పదే పదే ఎల్ నినో మాట…
  2. దూసుకొస్తున్న మహా విపత్తు…! ఏపీ తీరం వైపు ప్రచండ తుఫాన్ …
  3. బిజెపికి ‘భన్సల్’ సెగ…! ప‌ని చేయ‌ని నేత‌ల‌కు తోక క‌ట్‌…
  4.  కాలేశ్వ‌రంపై గులాబీ నేత‌ల ప్ర‌చారానికి చెక్ …! క‌ర్న‌ల్ ప‌రీక్షిత్ మెహ్ర‌తో స‌మాధానం…

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు