-
బ్యాంకు రుణం కేసులో సుప్రీంకోర్టులో చుక్కెదురు
-
సిబిఐ ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలన్న పిటిషన్ కొట్టివేత
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుకు షాక్ తగిలింది. అత్యున్నత న్యాయస్థానంలో ఎదురు దెబ్బ తగిలింది. ఇండ్ భారత్ పవర్ జెన్ కామ్ పేరుతో ఎస్బిఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సర్షియం నుంచి రుణాలు పొంది నిధులను దారి మళ్ళించారనే ఆరోపణల వ్యవహారంలో సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలని… విచారణపై స్టే ఇవ్వాలని ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేసారు. సోమవారం ఆ పిటిషన్ విచారణకు రాగా న్యాయస్థానం కొట్టివేసింది. ఈ దర్యాప్తు ప్రక్రియలో జోక్యం చేసుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.
రుణాల మల్లింపు పై…
పవర్ ప్లాంట్ లు, వ్యాపార విస్తరణ పేరుతో బ్యాంకుల నుంచి సేకరించిన రుణాలను నిబంధనలకు విరుద్ధంగా ఇతర అవసరాలకు దారి మళ్ళించారనేది ఆయనపై సిబిఐ మోపిన అభియోగం. ఈ వ్యవహారంలో సిబిఐ క్రిమినల్ కుట్ర, మోసం, విలువైన పత్రాల ఫోర్జరీ, నకిలీ పత్రాలను అసలైనవిగా ఉపయోగించడం సహా అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసింది. మద్రాస్ హైకోర్టు ఆదేశాల ప్రకారం 16 వారాల్లోగా ఈ కేసు విచారణ పూర్తి చేసి సిబిఐ చార్జ్ షీట్ దాఖలు చేయాల్సి ఉన్నందున.. తాము ఈ దశలో ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.
మద్రాస్ హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ…
ఈ అంశంపై గతంలోనే మద్రాస్ హైకోర్టులో విచారణ జరిగింది. అప్పుడు కూడా విచారణ ప్రక్రియను నిలిపివేసి.. కేసు కొట్టివేయాలన్న రఘురామరాజు రఘురామరాజు విజ్ఞప్తిని తోసి పుచ్చింది. అయితే దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు రఘురామకృష్ణం రాజు. సోమవారం జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ శీల్ నాగులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున ఎఫ్ఐఆర్ ను రద్దు చేయలేమని గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తూ ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది. రఘురామకృష్ణం రాజుతో పాటు కేసులోని ఇతర డైరెక్టర్లు కనుమూరు ఇందిరా దర్శిని, రమాదేవి, మధుసూదన్ రెడ్డి, అంబేద్కర్ రాజ్ కుమార్ ల పిటిషన్లన్నింటినీ ఏకకాలంలో కొట్టేసింది న్యాయస్థానం.
ఇవి కూడ చదవండి:
-
రేవంత్ మహారాష్ట్ర బాట…! తుమ్మిడిహెట్టి బ్యారేజీ పట్టాలెక్కేనా…?
-
రిలయన్స్ జియో ప్రభంజనం…!
-
ఏపీలో స్థానిక ఎన్నికలు రద్దు..!
-
‘పట్టభద్రులు’ పై కెసిఆర్ పక్క స్కెచ్…!
