మునుగోడు క్రైమ్ మిర్రర్:ఓటరు జాబితా జిల్లా పరిశీలకురాలు, కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్ దేవసేన మంగళవారం మునుగోడు మండల కేంద్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా మండల ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన 171వ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి, అక్కడ చేపడుతున్న ఓటరు జాబితా సవరణ ప్రక్రియ (ఎస్ఐఆర్)ను పరిశీలించారు.పోలింగ్ కేంద్రంలో సంబంధిత సిబ్బంది నిర్వహిస్తున్న ప్రక్రియను ఆమె పరిశీలించారు. ఓటరు జాబితా సవరణకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తూ, ప్రక్రియకు సంబంధించిన వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఓటరు జాబితా ప్రక్రియలో పారదర్శకత, ఖచ్చితత్వం పాటించడం కీలకమని ఈ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇవి కూడ చదవండి:
-
నిద్రలేమితో మానసిక ఆరోగ్యానికి ముప్పు: వైద్యుల కీలక హెచ్చరికలు
-
కూటమి ప్రభుత్వాన్ని తుడుచిపెట్టేస్తాం: వైఎస్ జగన్ ధీమా
-
హయత్నగర్లో విషాదం.. లారీ ఢీకొని బీటెక్ విద్యార్థి మృతి
-
ఫ్రూట్ జ్యూస్ కంటే పండ్లు తినడమే ఆరోగ్యానికి మేలు: ఆరోగ్య నిపుణుల సలహా
