HomeUncategorizedఏపీ అభివృద్ది ధ్యేయంగా ప‌ని చేస్తున్నాం...! డిప్యూటి సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

ఏపీ అభివృద్ది ధ్యేయంగా ప‌ని చేస్తున్నాం…! డిప్యూటి సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

అమ‌రావ‌తి, క్రైమ్‌మిర్ర‌ర్‌: ఏపీ అభివృద్ది విష‌యంలో రాజీ ప‌డ‌కుండా నిర్విరామంగా ప‌ని చేస్తున్నామ‌ని డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. మంగ‌ళ‌వారం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. క్లిష్ట ప‌రిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామ‌ని పేర్కొన్నారు. దేశానికి వ‌చ్చే పెట్టుబ‌డుల్లో 25 శాతం రాష్ర్టానికే వ‌స్తున్నాయ‌ని పేర్కొన్నారు. సీట్ల స‌ర్దుబాటు విష‌యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు చొర‌వ‌తో సీర్దుబాటు చాలా చ‌క్క‌గా చేసిన‌ట్లు పేర్కొన్నారు. అంద‌రం చ ర్చించుకున్నాకే లిస్ట్ ఫైన‌లైజ్ చేశామ‌ని పేర్కొన్నారు. తాము భీం ఫాం ఇచ్చిన‌వారే అభ్య‌ర్థుల‌ని స్ప‌ష్టం చేశారు. మిగిలిన‌వారు ఉప‌సంహ‌రించుకోవాల‌ని పేర్కొన్నారు.

కూట‌మికి తోడుగా నేత‌లు నిల‌బ‌డి అభ్య‌ర్థి విజ‌యం కోసం ప‌ని చేయాల‌ని పిలుపునిచ్చారు. సీట్ల విష‌యంలో్ అంద‌రికి స‌ర్దిచెప్పి ఏకాభిప్రాయంతో ఎన్నిక‌ల‌కు వెళ్తున్నామ‌ని 2024 ఎన్నిక‌ల్లో కూట‌మి చూపిన ఐక్య‌త‌ను మ‌రోసారి చూపాల‌న్నారు. కూటమి సర్దుబాటు సమయంలోనే ఆర్నబ్ తుఫాన్ వచ్చిందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇంత బిజీగా ఉన్నా కూడా సీఎం తుఫాన్‌పై సమీక్షలు చేశారని అన్నారు. సంక్షోభం సమయంలో చంద్రబాబు పనిచేసే తీరు అందరికీ స్పూర్తినిస్తుందన్నారు. తుఫాన్‌పై తన పరిధిలో కూడా కొన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడినట్లు చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. దూసుకొస్తున్న మహా విపత్తు…! ఏపీ తీరం వైపు ప్రచండ తుఫాన్ …
  2. బిజెపికి ‘భన్సల్’ సెగ…! ప‌ని చేయ‌ని నేత‌ల‌కు తోక క‌ట్‌…
  3.  కాలేశ్వ‌రంపై గులాబీ నేత‌ల ప్ర‌చారానికి చెక్ …! క‌ర్న‌ల్ ప‌రీక్షిత్ మెహ్ర‌తో స‌మాధానం…
  4.  భారీ తుఫాన్ ముప్పు.. SMDA తీవ్ర హెచ్చరిక!

 

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు