Homeతెలంగాణ'పట్టభద్రులు' పై కెసిఆర్ పక్క స్కెచ్...!

‘పట్టభద్రులు’ పై కెసిఆర్ పక్క స్కెచ్…!

  • సోషల్ ఇంజనీరింగ్ ను నమ్ముకున్న గులాబీ బాస్

  • అభ్యర్థులపై కొత్త ప్లాన్

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక రసవత్తరంగా మారుతోంది. రెండు స్థానాలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయింది. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను సైతం ప్రకటించాయి. కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. ఈసారి ఓటర్ల జాబితాను పూర్తిగా కొత్తగా రూపొందిస్తుండడంతో పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించే బాధ్యతను ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తమ భుజాన వేసుకున్నాయి. అధికార కాంగ్రెస్ ఇప్పటికే తమ అభ్యర్థుల ప్రకటన, ఓటర్ల నమోదులో ముందంజలో నిలిచింది. విపక్ష బిఆర్ఎస్, బిజెపి మాత్రం వ్యూహంతో తుది అభ్యర్థుల ఎంపికపై అంతర్గత కసరత్తును ముమ్మరం చేశాయి.

పూర్తిగా సీన్ మార్చాలని…

ఈ రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటి పూర్వ వైభవం కోసం కేసీఆర్ సరికొత్త స్కెచ్ వేశారు. కేటీఆర్ సైతం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల అనంతరం విద్యావంతులు, ఉద్యోగులు, పట్టభద్రుల్లో బిఆర్ఎస్ పట్ల ఉన్న అభిప్రాయాన్ని సానుకూలంగా మార్చుకునేందుకు ఈ ఎన్నికలను ఒక సువర్ణ అవకాశంగా కేసిఆర్ చూస్తున్నారు. అందులో భాగంగానే సాంప్రదాయ ఓటు బ్యాంకు తో పాటు స్థానిక సోషల్ ఇంజనీరింగ్ సూత్రాన్ని పక్కాగా అమలు చేయాలని నిర్ణయించారు. పట్టభద్రుల్లో వ్యక్తిగత ఇమేజ్, మంచి వాగ్దాటి, బలమైన అనుచర గణం ఉన్న నాయకులను బరిలోకి దించేందుకు కసరత్తు చేస్తున్నారు.

బలమైన అభ్యర్థుల కోసం…

ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం పార్టీ క్యాడర్ పట్ల విధేయత మాత్రమే గెలుపును కాయం చేయలేదని గులాబీ పార్టీ అధిష్టానం భావిస్తోంది. పట్టభద్రుల నియోజకవర్గాలు ఐదు ఆరు ఉమ్మడి జిల్లాల పరిధిలో విస్తరించి ఉండటం వల్ల.. ప్రచారాన్ని గ్రామీణ స్థాయి వరకు తీసుకెళ్లగల అంగ బలం, మర్దబలం ఉన్న నేతలకి ఓటు వేయాలని డిసైడ్ అయ్యారు. ఖర్చులకు తట్టుకొని.. సొంత బలంతో విస్తృత ప్రచారం చేసుకోగల ఆర్థిక పటిష్టత ఉన్న అభ్యర్థులతో కేసిఆర్, కేటీఆర్ లు ఇప్పటికే ముఖాముఖి సమావేశాలు పూర్తి చేశారు. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ తమ ప్రభుత్వ సంక్షేమం, టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు, ఉద్యోగ నియామకాలను అస్త్రం చేసుకొని పట్టభద్రులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. బిజెపి తన అర్బన్ ఓటు బ్యాంకు తోపాటు మోదీ ప్రభుత్వ ఇమేజ్తో నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున పేర్లను పంపించి టికెట్ల ఎంపికను కొలిక్కి తెచ్చే పనిలో పడింది. కానీ కెసిఆర్ మాత్రం పూర్తిగా సోషల్ ఇంజనీరింగ్ ను నమ్ముకున్నారు. కాంగ్రెస్ ముందస్తు ప్రచార స్పీడ్ కు చెక్ పెడుతూ.. కెసిఆర్ ప్రకటించబోయే ఆ మాస్టర్ క్యాండిడేట్స్ పోటీని ఏమలుపు తిప్పుతారో చూడాలి.

ఇవి కూడ చ‌ద‌వండి:

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు