-
సంక్షోభ సమయంలో ప్రజలను ఆందోళనకు గురిచేస్తారా?
-
గులాబీ పార్టీ ఎదురుదాడి
-
కాంగ్రెస్ కు నష్టమే
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో రానున్న రోజుల్లో తీవ్రమైన నీటి, విద్యుత్ సంక్షోభం ఏర్పడనుంది. తరచూ దీనిపై వార్తలు వస్తుండడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. మరోవైపు సీఎం రేవంత్ పదేపదే చేస్తున్న హెచ్చరిక వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి. ఎల్ నినో ప్రభావంతో సాగునీటి ప్రాజెక్టులు ఖాళీగానే ఉన్నాయని.. భూగర్భ జలాలు దారుణంగా పడిపోతాయని సీఎం వరుస సమీక్షలో హెచ్చరిస్తున్నారు. వారానికి ఒకసారి అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహిస్తూ.. ప్రజలు నీటిని, విద్యుత్ విచక్షణతో పొదుపుగా వాడుకోవాలని పిలుపునివ్వడం చర్చనీయాంసం అవుతుంది. విపత్తును ఎదుర్కొనేందుకు కేంద్రం నుంచి తక్షణమే పదివేల కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ అవసరం అంటూ ఢిల్లీకి లేఖలు రాయడం.. పాలకుల ముందస్తు ప్రణాళిక లేక సంక్షోభయాలను సృష్టించడమా అన్న చర్చకు తెరలేపింది.
కాంగ్రెస్ సమర్థించుకుంటున్నా…
తెలంగాణలో క్షేత్రస్థాయిలో తాగునీటి సరఫరా, వ్యవసాయానికి సాగునీరు, వేసవి విద్యుత్ డిమాండ్ ను సమతుల్యం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కసరత్తు చేస్తోందని కాంగ్రెస్ వర్గాలు చెబుతూ వస్తున్నాయి. ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు తగ్గిపోతున్నందున కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలో ఉన్న రిజర్వాయర్ల నుంచి సాగునీటి విడుదలకు ప్రాధాన్యతలను ఖరారు చేయాలని.. హైదరాబాద్ వంటి మహా నగరాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా ఇప్పటినుంచి ట్యాంకర్ల నిర్వహణ, బోర్ల పునరుద్ధరణ చేపట్టాలని సీఎం యంత్రాంగాన్ని ఆదేశించారు. విద్యుత్ కొరత రాకుండా ఉండేందుకు రైతులకు, గృహ వినియోగదారులకు అంతరాయం కలగకుండా గ్రిడ్ నిర్వహణ చేయాలంటూనే.. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల సమీకరణకు నిధుల కొరత ఉందని.. అందుకే కేంద్రం పదివేల కోట్లు ఇవ్వాలని పట్టుబడుతున్నారు.
గులాబీ పార్టీ కి అవకాశం…
ఒకవైపు రేవంత్ ముందస్తు చర్యలను గులాబీ పార్టీ ఎద్దేవా చేస్తోంది. ఎదురుదాడికి దిగుతోంది. ఒక బాధ్యతాయుతమైన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు కొండంత ధైర్యం చెప్పి సంక్షోభాల నుంచి గట్టెక్కించాల్సింది పోయి.. రోజు మీడియా ముందుకు వచ్చి ప్రజలను, రైతులను విపత్తు పేరుతో భయభ్రాంతులకు గురిచేయడం పాలనా వైఫల్యానికి నిదర్శనం అంటూ కేటీఆర్ తో సహా గులాబీ పార్టీ నేతలు మండిపడుతున్నారు. పాలన చేతకాక, ఎన్నికలవేళ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయలేక.. రాబోయే రోజుల్లో తాము ఇవ్వలేకపోయే నిరంతర విద్యుత్, సాగునీటి కొరత నెపాన్ని ప్రకృతి పైకి, ఎల్ నినో ఖాతాలోకి నెట్టేసి ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ముందస్తు సాకుల స్క్రిప్ట్ సిద్ధం చేసుకుంటుంది అనేది గులాబీ పార్టీ ఆరోపణ. సోషల్ మీడియా వేదికగా కెసిఆర్ 10 సంవత్సరాల పాలనతో రేవంత్ ఏడాదిన్నర పాలన పోలుస్తూ పెద్ద ఎత్తున డిజిటల్ యుద్ధం నడుస్తోంది. గతంలో ఎంతటి వర్షాభావ పరిస్థితులు ఎదురైనా కాలేశ్వరం, మిషన్ భగీరథ ద్వారా గ్రామ గ్రామాన తాగునీరు, 24 గంటల ఉచిత విద్యుత్ అందించామని గులాబీ పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాయి. గత పాలకులు చేసిన వేలకోట్ల అప్పులు, నిర్వహణ లోపాల వల్లే నేడు వ్యవస్థలు సంక్షోభంలో పడ్డాయని కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం కౌంటర్ ఇస్తోంది. ప్రకృతి వైపరీత్యాలముగ్గును సాకుగా చూపి విద్యుత్ కోతలు, తాగునీటి సరఫరాలో అంతరాయాలను సాధారణంగా విడిచి పెడితే మాత్రం అది కాంగ్రెస్ ప్రభుత్వానికి తీవ్ర ప్రజా వ్యతిరేకత తప్పదు. అటువంటి వీలైనంత త్వరగా మానుకొని సంక్షోభ నివారణ పై దృష్టి పెడితే మంచిది.
ఇవి కూడ చదవండి:
- కాలేశ్వరంపై గులాబీ నేతల ప్రచారానికి చెక్ …! కర్నల్ పరీక్షిత్ మెహ్రతో సమాధానం…
-
భారీ తుఫాన్ ముప్పు.. SMDA తీవ్ర హెచ్చరిక!
-
నెతన్యాహును గెలిపించండంటూ ట్రంప్ ట్వీట్!
-
న్యూజిలాండ్తో మూడో T20కీ స్టార్ బ్యాటర్ దూరం!
