క్రైమ్ మిర్రర్, సినిమా:- నందమూరి బాలకృష్ణ మరియు కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్న కొత్త సినిమా కోసం కథానాయికగా సంయుక్తా మీనన్‌ను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ-2’ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ హిట్ కాంబో ఇప్పుడు మరోసారి పునరావృతం కానుండటంతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
ముంబై ఇండియన్స్ నాయకత్వంపై రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ నవంబర్ మొదటి వారంలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ముఖ్యంగా సినిమాలోని కీలకమైన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కోసం ఒక భారీ సెట్‌ను సిద్ధం చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. ప్రారంభంలో బాలకృష్ణ లేని సన్నివేశాలను తెరకెక్కించి, ఆ తర్వాత ఆయన సెట్స్‌లోకి అడుగుపెడతారని తెలిసింది. కొరటాల శివ మార్క్ మేకింగ్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
