Homeక్రీడలుముంబై ఇండియన్స్ నాయకత్వంపై రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ముంబై ఇండియన్స్ నాయకత్వంపై రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్:- ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ తిరిగి బాధ్యతలు స్వీకరిస్తారంటూ ప్రచారం జరుగుతున్న వేళ, మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముంబై జట్టు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను తక్కువ సమయంలో సరిదిద్దే అపారమైన అనుభవం ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు మాత్రమే ఉందని ఒక ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు.

జడ్జి కుమారుడి కారు బీభత్సం.. 55 ఏళ్ల వ్యక్తి దుర్మరణం

డ్రెస్సింగ్ రూమ్ అందరూ గౌరవించే ఒక సమర్థవంతమైన నాయకుడు ప్రస్తుతం ఆ జట్టుకు ఎంతో అవసరమని అశ్విన్ తెలిపారు. అందువల్ల రోహిత్ శర్మ కనీసం ఒక్క ఏడాదైనా ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా వ్యవహరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, జట్టు కొత్త కోచ్ పొలార్డ్‌తో రోహిత్‌కు మంచి అనుబంధం ఉందని కూడా అశ్విన్ గుర్తుచేశారు. రోహిత్ నాయకత్వంలో ముంబై జట్టు మళ్లీ పాత వైభవాన్ని సాధించగలదని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.

బాబాయ్‌ ఇంట్లో బంగారం చోరీ.. అమ్మి థార్‌ కొనుగోలు చేసిన యువకుడు!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు