Homeతెలంగాణవైఎస్ జగన్ ఓటమిపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సందేహాలు..!

వైఎస్ జగన్ ఓటమిపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సందేహాలు..!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- 2024 ఎన్నికల ఫలితాలపై తెలంగాణ రాష్ట్ర రహదారులు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. ఢిల్లీలో నిర్వహించిన ఒక నిరసన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, కేంద్రంలో 2024 లో సీఈసీ అండ లేకపోతే బీజేపీకి కనీసం 140 సీట్లు కూడా వచ్చేవి కావు అని, రాహుల్ గాంధీ దేశ ప్రధాని అయ్యేవారని వ్యాఖ్యానించారు. తమిళనాడులో స్టాలిన్, బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహించిన స్థానాల్లో అసెంబ్లీ అభ్యర్థులు ఓడిపోవడం నమ్మశక్యంగా లేదని ఆయన ప్రశ్నించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలను ప్రస్తావిస్తూ, అటు ఏపీలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయారనేది తీవ్ర సందేహాలకు తావిస్తోందని అన్నారు. ఎన్నికల నిర్వహణ, ఫలితాల సరళిపై తమకు ఎన్నో అనుమానాలు ఉన్నాయని, వీటన్నింటిపై సమగ్ర విచారణ లేదా స్పష్టత అవసరమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ నిరసన వేదికగా డిమాండ్ చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వెదర్ మ్యాన్

రూమర్లకు చెక్ పెట్టిన స్టార్ హీరో & డైరెక్టర్..!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు