యాదాద్రి భువనగిరి జిల్లాలో డబ్బుల కోసం ఓ వృద్ధురాలిని హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. చౌటుప్పల్ మండలం తూప్రాన్పేట్లో ఈ దారుణం చోటుచేసుకుంది. వరుసకు అమ్మమ్మ అయిన మంటిపల్లి యాదమ్మ (70)ను ఆమె బంధువైన యువకుడు హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
సెప్టెంబర్ 27న యాదమ్మ తన ఇంట్లో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందింది. ఘటనపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా మృతురాలి బంధువు మంటిపల్లి రాజు (31)పై పోలీసులకు అనుమానం వచ్చింది.
దీంతో బుధవారం రాజును అదుపులోకి తీసుకుని విచారించగా.. యాదమ్మను తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు వెల్లడించారు. డబ్బుల అవసరంతోనే ఈ నేరానికి పాల్పడినట్లు విచారణలో తేలిందని తెలిపారు.
హత్య అనంతరం యాదమ్మ వద్ద ఉన్న బంగారు, వెండి నగలను తీసుకుని రాజు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
also read: కాపు నేత చేగొండి హరిరామజోగయ్య కుమారుడిపై టీడీపీ నేత కుమారుడు వాసిరెడ్డి బాబీ దాడి
