Homeఆంధ్ర ప్రదేశ్డిసెంబర్ వరకు సాధారణ వర్షపాతమే: ఐఎండీ కీలక ప్రకటన

డిసెంబర్ వరకు సాధారణ వర్షపాతమే: ఐఎండీ కీలక ప్రకటన

రాబోయే కాలంలో రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మరియు వర్షపాత సరళి ఎలా ఉండబోతున్నాయనేదానిపై భారత వాతావరణ శాఖ (IMD) స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్ వరకు రాష్టంలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ముఖ్యంగా ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రాబోయే రోజుల్లో లభించే నీటి వనరులను ప్రతి ఒక్కరూ ఎంతో సద్వినియోగం చేసుకోవాలని, నీటిని వృథా చేయకుండా జాగ్రత్త వహించాలని సూచించింది

కుల, మత పిచ్చి పార్టీలను ఓడించేందుకు యువత కదిలిరావాలి: విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

ఇక గడిచిన నైరుతి రుతుపవనాల సీజన్ (జూన్-సెప్టెంబర్) విషయానికి వస్తే, ఈ కాలంలో దాదాపు 13 శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రత్యేకించి ఏపీలో సాధారణం కంటే 25 శాతం తక్కువగా, అలాగే తెలంగాణలో 18 శాతం తక్కువగా వర్షాలు కురిసినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.మరోవైపు, డిసెంబర్ వరకు ఎల్ నినో ప్రభావం మరింత బలపడే ఛాన్స్ ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈ వాతావరణ మార్పుల దృష్ట్యా రైతులు, ప్రజలు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతకైన అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందువల్ల లభించే నీటి వనరులను అత్యంత సమర్థవంతంగా వాడుకుంటూ, రాబోయే సీజన్లను ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలని సూచించడమైనది.

ఈవీఎంలా? బ్యాలెట్ పేపర్లా? దేశంలో నిత్యం మారుతున్న ఎన్నికల చర్చపై విశ్లేషణ!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు