-
పాలమూరు రైతులతో భారీ ఉద్యమ కార్యాచరణ
-
ముందుగానే మేల్కొంటున్న కాంగ్రెస్
-
బిఆర్ఎస్ కు ధీటుగా వ్యూహరచన
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో :తెలంగాణ రాజకీయాల్లో సీఎం రేవంత్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేగాన్ని మరోసారి ప్రదర్శిస్తున్నారు. ఆ వేగాన్ని, దూకుడును తట్టుకోలేకపోతోంది గులాబీ పార్టీ. అందుకే అత్యంత సున్నితమైన నీళ్ల సెంటిమెంటును ప్రధాన ఆయుధంగా మార్చుకోవాలని భావిస్తోంది. రేవంత్ సొంత జిల్లా అయిన పాలమూరు కేంద్రంగా రైతాంగాన్ని ఏకం చేస్తూ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే వ్యూహాన్ని అమలు చేస్తోంది. ముఖ్యంగా జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీటిని తక్షణమే విడుదల చేయాలంటూ ఆందోళనలను తీవ్రతరం చేస్తోంది. సీఎం సొంత జిల్లాలోని రైతాంగం అసంతృప్తితో ఉండనే సంకేతాన్ని రాష్ట్రవ్యాప్తంగా పంపాలని భారత రాష్ట్ర సమితి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
చంద్రబాబుతో పోల్చుతూ…
ఇప్పటివరకు తెలంగాణలో నెగిటివ్ ప్రచారానికి చంద్రబాబు పేరును వాడుకున్న గులాబీ పార్టీ వ్యూహం మార్చింది. ఏపీలో చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పం కు హిందీ నీవా ప్రాజెక్టు ద్వారా నీటిని తరలించుకుంటే.. ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి మాత్రం తన సొంత జిల్లా పాలమూరు రైతులకు సాగునీరు అందించడంలో విఫలమయ్యారంటూ ముమ్మర ప్రచారం చేస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై జూరాల ప్రాజెక్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. రానున్న రోజుల్లో రైతులను పెద్ద ఎత్తున సమీకరించి రేవంత్ సర్కార్ పై తీవ్ర ప్రజా వ్యతిరేకతను పెంచేలా మరో విడత ఉద్యమానికి గులాబీ పార్టీ రంగం సిద్ధం చేస్తోంది.
తిప్పికొట్టే పనిలో కాంగ్రెస్…
ప్రతిపక్షం నుంచి ఎదురవుతున్న ఈ ఆస్త్రాన్ని ముందుగానే పసిగట్టింది అధికార కాంగ్రెస్. తిప్పి కొట్టేందుకు అంతే వేగంగా ప్రత్యామ్నాయ ప్రణాళికలు రచిస్తోంది. కర్ణాటకలో తమ పార్టీ ప్రభుత్వమే అధికారంలో ఉండడాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. ఎగువన ఉన్న కర్ణాటక ప్రాజెక్టుల నుంచి కృష్ణా జలాలను విడుదల చేయించి.. జూరాలకు తగినంత ఇంట్లో పెంచడం ద్వారా పాలమూరు గొంతు తడపాలని చూస్తున్నారు. ఇందుకోసం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో కూడిన ప్రత్యేక ప్రజాప్రతినిధుల బృందాన్ని కర్ణాటక కు పంపి.. నీటి విడుదలకు మార్గం సుగమం చేయాలని ప్రయత్నిస్తున్నారు. గులాబీ పార్టీ చేస్తున్న ఈ ప్రయత్నం రాజకీయంగా వారికి ఎంతవరకు మైలేజ్ ఇస్తుందనేది చూడాలి. ఎందుకంటే ఇప్పటివరకు గులాబీ పార్టీ సెంటిమెంట్ ఆస్త్రాలని అందుకుంది. ఇప్పుడు ఆ పార్టీకి నీళ్ల రాజకీయం కలిసి వస్తుందా? లేదా? అనేది చూడాలి.
ఇవి కూడ చదవండి:
-
విశాఖకు మెట్రో….! డబుల్ డెక్కర్ కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్…
-
అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట…! క్యాబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం…
-
మరోసారి డి లిమిటేషన్…! కేంద్రం కసరత్తు మొదలు…
-
మోడీ కొత్త వ్యూహం…! కేంద్ర మంత్రులతో చింతన్ శిబిరం…
