Homeక్రైమ్"జైలులో వేధింపులు భరించలేకపోతున్నా.. బెయిల్ ఇవ్వండి లేకపోతే చనిపోనివ్వండి": పవిత్రా గౌడ

“జైలులో వేధింపులు భరించలేకపోతున్నా.. బెయిల్ ఇవ్వండి లేకపోతే చనిపోనివ్వండి”: పవిత్రా గౌడ

కన్నడ చిత్రపరిశ్రమలో తీవ్ర సంచలనం రేపిన రేణుకాస్వామి హత్య కేసులో నటి పవిత్రా గౌడ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ సందర్భంగా ఆమె కోర్టులో భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది. న్యాయమూర్తి ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న పవిత్రా గౌడ.. జైలులో తనకు ఎదురవుతున్న ఇబ్బందులను వివరించినట్లు సమాచారం.

జైలులో నైజీరియాకు చెందిన మహిళా ఖైదీలు తనను వేధిస్తున్నారని పవిత్రా గౌడ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో తాను తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నానని కోర్టుకు చెప్పినట్లు సమాచారం. తనకు బెయిల్ మంజూరు చేయాలని, అది సాధ్యం కాకపోతే చనిపోయేందుకు విషం ఇవ్వాలని ఆమె కోరినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. పవిత్రా గౌడ తరఫు న్యాయవాదులు కూడా కోర్టులో కీలక విషయాలను ప్రస్తావించారు. జైలులోనే ఆమెను హత్య చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఆమె భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని న్యాయవాదులు కోరినట్లు తెలుస్తోంది.

రేణుకాస్వామి హత్య కేసు దర్యాప్తు సమయంలో పవిత్రా గౌడ పేరు ప్రధానంగా తెరపైకి వచ్చింది. ఈ కేసులో నటుడు దర్శన్‌తో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కేసు న్యాయస్థానం పరిధిలో ఉండటంతో.. విచారణలో వెల్లడయ్యే అంశాలు, కోర్టు ఆదేశాలు కీలకంగా మారాయి.

also read: షార్ట్ ఫిలిమ్ పేరుతో రూ.5 లక్షల మోసం.. టీవీ నటి అరెస్ట్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు