Homeతెలంగాణతెలంగాణలో దసరాకు కొత్త పింఛన్లు...! సీఎం ఆదేశం...

తెలంగాణలో దసరాకు కొత్త పింఛన్లు…! సీఎం ఆదేశం…

  • అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ అందాల్సిందే

  • పారదర్శకంగా ఎంపిక

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డి రాజకీయంగా దూకుడుగా ఉన్నారు. రాజకీయ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. అదే సమయంలో సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల్లో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న లక్షలాది కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను విజయవంతంగా పట్టాలెక్కించారు. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎదురుచూస్తున్న అర్హులందరికీ అక్టోబర్ నుంచే కొత్త సామాజిక పింఛన్లు మంజూరు చేయాలని నిర్ణయించారు. రాబోయే దసరా పండుగకు ముందే లబ్ధిదారుల చేతుల్లో ఈ పింఛన్ నగదు ఉండేలా చూడాలని అధికారులకు అత్యున్నత స్థాయి నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

కొంతకాలంగా కొత్త పింఛన్లపై…

గత కొంతకాలంగా తెలంగాణలో కొత్త పింఛన్ల అంశం తెరపైకి వచ్చింది. అయితే దాదాపు అధికారంలోకి వచ్చి మూడేళ్లు సమీపిస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేశారు. దసరా నుంచి కొత్త సామాజిక పింఛన్లు అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలన, వెరిఫికేషన్ ప్రక్రియను సరదాగా పూర్తి చేయాలని పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు ఆదేశాలు అందాయి. ఎక్కడా చిన్నప్పటి జాప్యానికి తావు లేకుండా…. అవసరం అనుకుంటే మండల, గ్రామస్థాయిలో అదనపు సిబ్బందిని నియమించుకోవాలని ప్రభుత్వం అధికార యంత్రాంగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క అర్హుడి కి పింఛన్ అందేలా పూర్తి పారదర్శకతతో రికార్డులను సిద్ధం చేయాలని.. ఎవరి వద్ద నుంచి ఎలాంటి సిఫార్సులు ఆశించకుండా అర్హత ప్రామాణికంగా లబ్ధిదారుల తుది జాబితాను ఖరారు చేయాలని అధికార వర్గాలు కు ఆదేశాలు అందాయి.

ఒంటరి మహిళలు, వితంతు పింఛన్లు…

ప్రధానంగా ఒంటరి మహిళలు, వితంతువుల పింఛన్ దరఖాస్తులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. గత గులాబీ ప్రభుత్వ హయాంలో ఏళ్ల తరబడి కొత్త పింఛన్లు మంజూరు కాక.. వృద్ధులతో పాటు వితంతువులు కార్యాలయాలు చుట్టూ తిరిగేవారు. దానిని గుర్తు చేస్తూ ప్రతి పేదవాడి ఇళ్లల్లో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్ అందేలా చూడాలని రేవంత్ సర్కార్ గట్టి ఆలోచనతో ఉంది.. గత కొద్దిరోజులగా రాజకీయంగా దూకుడు పెంచింది కాంగ్రెస్. విపక్షాలపై అవినీతి అస్త్రాన్ని ప్రయోగించింది. ఇప్పుడు సంక్షేమ పథకాలు బలంగా అమలు చేయడం ద్వారా దెబ్బతీయాలని చూస్తోంది.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. భారీ డీజే శబ్దం.. రెండో తరగతి బాలిక మృతి

  2. పెయిన్ కిల్లర్స్ అతిగా వాడుతున్నారా?.. అయితే జర జాగ్రత్త!

  3.  క్యాన్సర్ మందుల పేరిట భారీ దోపిడీ.. సుప్రీం కోర్టు సీరియస్!

  4. ఒక్కసారిగా మారిన వాతావరణం… హైదరాబాద్ లో దంచికొడుతున్న వర్షం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు