క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా.. తీవ్రమైన సామాజిక సమీకరణల పోరుగా రూపాంతరం చెందుతోంది. కెసిఆర్ కుటుంబం పై కేవలం అవినీతి, భూ దోపిడీ అనే కోణంలోనే కాకుండా.. తెలంగాణలో దశాబ్దాల పాటు సాగిన గడీల పాలన, దొరల అరాచకాలు అనే సామాజిక భయాన్ని ప్రజల్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇటీవల కెసిఆర్ కుటుంబ ఆస్తుల విషయంలో రగడ మొదలైంది. ఈ క్రమంలో షాద్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆపై ఆయనపై అనేక రకాల విమర్శలు వచ్చాయి. దానిని తిప్పి కొట్టే క్రమంలో ఎమ్మెల్యే శంకర్ వెలమ సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుంటూ చేసిన హెచ్చరికలు కొత్త రాజకీయానికి తెరతీసాయి.
పోరాటానికి మంచి నేపథ్యం…
Also Read:అడగగానే ఓకే అన్నారు.. లోకేష్ పై ప్రశంశలు కురిపించిన చాగంటి!
దశాబ్దాల తెలంగాణ చరిత్రను పరిశీలిస్తే బడుగు బలహీన వర్గాలు గడీల ఆధిపత్యానికి వ్యతిరేకంగా సాగించిన పోరాటాలకు సుదీర్ఘమైన నేపథ్యం ఉంది. తెలంగాణ ఉద్యమం ద్వారా ఆ సామాజిక వర్గ అసంతృప్తి తాత్కాలికంగా పక్కకు వెళ్లినప్పటికీ.. గత పదేళ్ల బిఆర్ఎస్ పాలన లో నిర్ణయాధికారాలన్నీ ఒకే కుటుంబం, నిర్దిష్ట సామాజిక వర్గం చేతుల్లోనే కేంద్రీకృతమయ్యాయి అనే భావన బిసి, దళిత వర్గాల్లో బలంగా నాటుకు పోయింది. ఇప్పుడు ఇదే చారిత్రక అసంతృప్తిని ఆసరాగా చేసుకుని.. కెసిఆర్ కుటుంబాన్ని కేవలం ఒక రాజకీయ శత్రువు గానే కాక.. బహుజన వర్గాల అవకాశాలను ఆక్రమించిన సామాజిక ప్రతినిధిగా చిత్రీకరించేందుకు రేవంత్ పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్నారు.
రాజకీయ క్రీడ…
Also Read: సౌదీ వ్యవహారాల్లో తలదూర్చవద్దు: పాకిస్థాన్, తూర్కియేలకు హౌతీల తీవ్ర హెచ్చరిక
ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణలో ఒక రాజకీయ క్రీడ ఆడుతున్నారు సీఎం రేవంత్. తెలంగాణ ప్రజలకు ఒక వ్యూహాత్మక సంకేతాలను పంపుతున్నారు. కెసిఆర్ కుటుంబం వద్ద ఉన్న ఆస్తులు, వారి సామాజిక వర్గం ఎంత ఉందో.. వారు అనుభవిస్తున్న పదవులు ఎన్ని అనే అంశాలపై పరోక్షంగా, ప్రత్యక్షంగా సభల్లోనూ.. సభల వెలుపల ప్రస్తావించడం ద్వారా ప్రజల్లో ఆలోచన రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నారు. వెలమల దొరల పాలనలో నష్టపోయిన బహుజన బిడ్డలకు అధికారాన్ని అందించామనే వ్యతిరేకతను బలోపేతం చేయడం ద్వారా.. గులాబీ పార్టీని ఆత్మరక్షణలో పడేయడమే రేవంత్ రెడ్డి మార్కు రాజకీయ వ్యూహంగా కనిపిస్తోంది.
ఆ ఆంతర్యంతో…
Also Read:పిఠాపురంలో ‘మెగా’ ప్రాజెక్ట్!
షాద్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ ఒక అడుగు ముందుకు వేసి.. కెసిఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. కెసిఆర్ చావు డబ్బు కొడతాం అంటూ వ్యాఖ్యలు చేశారు. వెలమ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకొని పౌరుషంగా మాట్లాడారు. అయితే ఇక్కడే ఒక ఎత్తుగడ ఉంది. దానిని హైలెట్ చేస్తూ గులాబీ పార్టీ కౌంటర్ దాడి చేస్తే దానిని దొరలు, బహుజనుల మధ్య ఘర్షణగా చిత్రీకరించే అంతర్యం దాగి ఉందనేది విశ్లేషకుల మాట. వెలమ ఆధిపత్యాన్ని సవాల్ చేయడం వెనుక.. దిగువ వర్గాల బలం పొందాలన్నది ఆలోచన. గులాబీ పార్టీ తన పది సంవత్సరాల పాలనలో అభివృద్ధిని చూసి పుంజుకోవాలని చూస్తుంటే.. కాంగ్రెస్ సర్కార్ మాత్రం కెసిఆర్ కుటుంబాన్ని పొలిటికల్ గా మాత్రమే కాకుండా.. సోషియో పొలిటికల్ గా కార్నర్ చేసేందుకు సిద్ధమయింది. చూడాలి ఈ ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో.
