ఢిల్లీ, క్రైమ్‌మిర్రర్: గడిచిన వారం రోజుల్లో సౌది అరేబియా యెమెన్‌లోని తమ ఆధీనంలో ఉన్న పలు ప్రాంతాల్లో 300 సార్లు దాడులు చేసిందని హౌతీలు పేర్కొన్నారు. కాగా 24 గంటల్లోసైతం 26 సార్లు దాడులకు పూనుకుందని శుక్రవారం తెలిపారు. హౌతీలు, సౌదీల మధ్య ఘర్షణలు హింసాత్మకంగా మారింది. గత కొన్ని రోజులుగా హౌతీలకు, సౌదీలకు ఘర్సణలు జరుగుతున్నాయి. తాజాగా ఘర్షణలు హింసాత్మకంగా మారి ఈ నెలలో యెమెన్ రెడ్ సీ తీరంలో ఉన్న బాబ్-అల్-మండేబ్ జలసంధిని హౌతీలు తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు.
Also Read:బిఆర్ఎస్ ఆత్మరక్షణ…!
ఆ జలసంధి గుండా సౌదీ నౌకలు తప్ప అన్నిదేశాల నౌకలూ స్వేచ్ఛగా ప్రయాణిస్తున్నాయని వారు చెబుతున్నారు. జులై నుంచి బాబ్-అల్-మండేబ్ ద్వారా వెళ్లే సౌదీ అరేబియా ఎగుమతుల సంఖ్య గణనీయంగా తగ్గినట్టు తెలుస్తోంది. గతంలో 2014లో యెమెన్ రాజధాని సనాను \హౌతీలు ఆక్రమించుకున్న సందర్భంలో అంత్యరుద్యం మొదలు కాగా 2015లో హౌతీలకు వ్యతిరేకంగా సౌదీ అరేబియా తమ సైనికులను యుద్దం రంగంలోకి దింపింది. ఇదీ హౌతీ, సౌదీలకు పర్సర దాడులకు దారి తీసింది. ఈ క్రమంలో తాజాగా 26 సార్లు సౌదీ అరేబియా దాడి చేసిందని పేర్కొన్నారు.
Also Read:మాజీ మంత్రి అవంతి యూటర్న్…!
