Homeఆంధ్ర ప్రదేశ్మాజీ మంత్రి అవంతి యూటర్న్...!

మాజీ మంత్రి అవంతి యూటర్న్…!

  • వైసీపీలో చేరే అవకాశం

  • ఆయన కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్న అగ్ర నేతలు

  • పార్టీలోకి వస్తే భీమిలి బాధ్యతలు

 

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఉత్తరాంధ్ర రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు గుడ్ బై చెబుతుండడంతో ప్రత్యామ్నాయంపై సీరియస్ గా దృష్టి పెట్టారు జగన్మోహన్ రెడ్డి. ప్రధానంగా విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గ బాధ్యతలు విషయంలో ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. రాష్ట్రంలో కీలక నియోజకవర్గం కావడంతో అక్కడ ఇంచార్జ్ బాధ్యతలు వీలైనంత త్వరగా కొత్త నేతకు అప్పగించాలని భావిస్తున్నారు. ఇక్కడ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఆయన విజయనగరం జిల్లాకు పార్టీ అధ్యక్షుడు కూడా. అయితే విజయనగరం జిల్లా అధ్యక్ష పదవి మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్కు అప్పగించారు. భీమిలి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించేందుకు బలమైన నేత కోసం అన్వేషిస్తున్నారు.

కీలకమైన నియోజకవర్గం…

Also Read:చిరంజీవి ‘కాకా’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతికి మెగా మాస్ ట్రీట్!

రాష్ట్రంలోనే అత్యంత కీలక నియోజకవర్గం భీమిలి. అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో ఐటీ పరిశ్రమలు పెద్ద ఎత్తున ఆనియోజకవర్గంలోనే ఏర్పాటు అవుతున్నాయి. మరోవైపు చెంతనే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. పర్యాటక ప్రాజెక్టుల సైతం పెద్ద ఎత్తున ఏర్పాటు అవుతున్నాయి. పైగా అక్కడ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇంకోవైపు గ్రేటర్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అక్కడ బలమైన నేతను రంగంలోకి దించాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి.

అమర్నాథ్ ప్రయత్నాలు…

Also Read:న్యాయ వ్య‌వ‌స్థ‌పై న‌మ్మ‌కం ఉంది…! కేటీఆర్‌

భీమిలి నియోజకవర్గం బాధ్యతల కోసం మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చోడవరం నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నారు. అక్కడ అయిష్టత గానే ఆయన కొనసాగుతున్నట్లు ప్రచారంలో ఉంది. భీమిలి నియోజకవర్గం అయితే రాజకీయంగా కలిసి వస్తుందన్న ఆశతో గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. తన మనసులో ఉన్న మాటను బయటపెట్టారు గుడివాడ. కానీ జగన్మోహన్ రెడ్డి నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. మరోవైపు పార్టీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆయన పేరును ప్రకటిస్తారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ నాలుగు రోజులుగా జాప్యం జరుగుతూనే ఉంది.

కీలక చర్చలు…

Also Read: నా తండ్రి ప్రోత్సాహం ఎప్పటికీ మర్చిపోలేను- జేసన్ సంజయ్

మరోవైపు మాజీమంత్రి, భీమిలి మాజీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు తిరిగి వైసీపీలో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయన ఇప్పటికే ప్రాతినిధ్యం వహించడంతో.. ఆయన అయితే సరిపోతారని భావించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు టచ్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేశారు అవంతి శ్రీనివాస్. అయితే ఫలితాలు వచ్చిన తర్వాత పార్టీకి దూరంగా వెళ్లిపోయారు. జనసేనలో చేరుతారని భావించినా జరగలేదు. అయితే ఇప్పుడు వైసీపీ నేతలు ఆయన కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని.. సఫలం అయితే అవంతి శ్రీనివాస్ తాడేపల్లి పార్టీ కార్యాలయానికి చేరుకునే అవకాశం ఉంది. ఆయన రాకపోతే మాత్రం మాజీమంత్రులు కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజుతో త్రిసభ్య సమన్వయ కమిటీని నియమించే ఆలోచన చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు