Homeక్రైమ్మెట్లపై నుంచి జారిపడి విద్యార్థిని మృతి

మెట్లపై నుంచి జారిపడి విద్యార్థిని మృతి

క్రైమ్ మిర్రర్ : పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నాలుగో తరగతి చదువుతున్న వర్ణిక అనే విద్యార్థిని పాఠశాల మెట్లు దిగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు అదుపుతప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో చిన్నారి తీవ్రంగా గాయపడటంతో పాఠశాల సిబ్బంది వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు చికిత్స అందిస్తున్నప్పటికీ గురువారం రాత్రి వర్ణిక మృతి చెందినట్లు సమాచారం.

విద్యార్థిని మెట్లపై నుంచి కిందపడిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు పాఠశాలలోని సీసీ కెమెరాల్లో నమోదైనట్లు తెలుస్తోంది. చిన్నారి మృతితో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పాఠశాలలోనూ విషాద వాతావరణం ఏర్పడింది. అయితే ఘటన జరిగిన అనంతరం పాఠశాల యాజమాన్యం తమకు వెంటనే పూర్తి సమాచారం అందించలేదని, ఆలస్యం చేసిందని వర్ణిక కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, ప్రమాదానికి గల కారణాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
also read :చిరంజీవి ‘కాకా’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతికి మెగా మాస్ ట్రీట్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు