Homeక్రైమ్విజయవాడ కస్టోడియల్ డెత్ కేసులో కీలక మలుపు.. సిట్ ఎదుట ఏ4 నిందితుడి లొంగుబాటు

విజయవాడ కస్టోడియల్ డెత్ కేసులో కీలక మలుపు.. సిట్ ఎదుట ఏ4 నిందితుడి లొంగుబాటు

విజయవాడలో గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ4గా ఉన్న సురేష్ సిట్ అధికారుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. దీంతో కేసులో అతడి పాత్రపై దర్యాప్తు మరింత కీలకంగా మారింది.

సాయికృష్ణ మృతదేహం మాయం వ్యవహారంలో సురేష్ కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే కేసులో నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజుకు సురేష్ సన్నిహితుడిగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సురేష్‌కు సంబంధించిన వ్యవహారాలపై సిట్ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

మరోవైపు సాయికృష్ణ కుటుంబంతో సెటిల్‌మెంట్ చేసేందుకు కూడా సురేష్ ప్రయత్నించినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఈ అంశంతో పాటు మృతదేహం మాయం వ్యవహారంలో అతడి పాత్ర ఏంటి? ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి? అనే కోణాల్లో సిట్ అధికారులు విచారణ చేపడుతున్నట్లు సమాచారం. సురేష్ లొంగిపోవడంతో కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

also read: 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. టీనేజర్లకు కొత్త పరిమితులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు