హైదరాబాద్‌లో ‘ఢీ-10’ డ్యాన్స్ షో విజేతగా గుర్తింపు పొందిన రాజును మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ యువతి చేసిన ఫిర్యాదు ఆధారంగా లైంగిక వేధింపులు, సినిమా అవకాశాల పేరుతో మోసం చేశారనే ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసి ఈ చర్యలు చేపట్టారు. అరెస్ట్ అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం రిమాండ్ విధించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 9న ఓ యువతి మియాపూర్ పోలీసులను ఆశ్రయించింది. రాజు తనను లైంగికంగా వేధించాడని, సినీ రంగంలో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి మోసం చేశాడని ఫిర్యాదులో ఆరోపించింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
విచారణలో భాగంగా ఆరోపణలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు లభించడంతో రాజును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం రిమాండ్ విధించింది.
అయితే రాజు అరెస్ట్ విషయాన్ని పోలీసులు కొంతకాలం బయటకు వెల్లడించకుండా గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ విషయం వెలుగులోకి రావడంతో చర్చనీయాంశంగా మారింది. యువతి చేసిన ఆరోపణలపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కేసు దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read: ‘ది ప్యారడైజ్’కు ట్రైలర్ ఎందుకు లేదంటే.. అసలు కారణం ఇదేనంటూ నాని వివరణ
