Homeక్రైమ్వేడి నీళ్ల బకెట్‌లో పడి నాలుగేళ్ల బాలిక మృతి.. మైలార్‌దేవ్‌పల్లిలో విషాదం

వేడి నీళ్ల బకెట్‌లో పడి నాలుగేళ్ల బాలిక మృతి.. మైలార్‌దేవ్‌పల్లిలో విషాదం

హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లి పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రగతినగర్‌లో ఇంట్లో ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలిక ప్రమాదవశాత్తు వేడి నీళ్లతో ఉన్న బకెట్‌లో పడిపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన చిన్నారి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.

స్థానికంగా తెలిసిన వివరాల ప్రకారం.. నాలుగేళ్ల మానస ఇంట్లో ఆడుకుంటోంది. ఆ సమయంలో ఆమె తల్లి ఫోన్‌లో మాట్లాడేందుకు బయటకు వెళ్లింది. తల్లి బయట ఉన్న సమయంలో చిన్నారి అనుకోకుండా వేడి నీళ్లు ఉన్న బకెట్‌లో పడిపోయింది. దీంతో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి.

వెంటనే కుటుంబ సభ్యులు చిన్నారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో మానస మృతి చెందింది. చిన్నారి మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

also read: బెంగళూరు ఫైవ్‌స్టార్ హోటల్‌లో దారుణం.. ఇద్దరు కుమార్తెలను చంపి తండ్రి ఆత్మహత్యాయత్నం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు