Homeఆంధ్ర ప్రదేశ్ఏఎన్‌యూ స్వర్ణోత్సవాలకు ప్రత్యేక గుర్తింపు.. పోస్టల్ స్టాంప్ ఆవిష్కరించిన నారా లోకేశ్

ఏఎన్‌యూ స్వర్ణోత్సవాలకు ప్రత్యేక గుర్తింపు.. పోస్టల్ స్టాంప్ ఆవిష్కరించిన నారా లోకేశ్

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ) 50 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను ఆవిష్కరించారు. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ గురువారం సచివాలయంలో ఈ ప్రత్యేక స్టాంప్‌ను ఆవిష్కరించారు. యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ వేడుకలకు చిరస్మరణీయ గుర్తుగా ఈ స్టాంప్‌ను రూపొందించినట్లు అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ.. ఏఎన్‌యూ స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ఆయన తన సోషల్ మీడియా ఖాతా ద్వారా కూడా వెల్లడించారు.

ఏఎన్‌యూ ఐదు దశాబ్దాల ప్రస్థానంలో సాధించిన విజయాలు, ఉన్నత విద్యారంగానికి అందించిన సేవలను అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గోల్డెన్ జూబ్లీ సందర్భంగా యూనివర్సిటీలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమాల గురించి కూడా వివరించారు.

also read: మరాఠీ భాషపై వ్యాఖ్యలు.. వివాదం ముదరడంతో మంత్రి సర్నాయక్‌కు సంజయ్ దత్ ఫోన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు