Homeక్రైమ్శేషాచల అడవుల్లో స్మగ్లర్లపై వేట.. ఇద్దరు అరెస్ట్

శేషాచల అడవుల్లో స్మగ్లర్లపై వేట.. ఇద్దరు అరెస్ట్

క్రైమ్ మిర్రర్ : శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న స్మగ్లర్లపై ఆర్‌ఎస్‌ఏఎస్‌టీఎఫ్ అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. చిత్తూరు జిల్లా గుడిపాల మండల పరిధిలో శుక్రవారం టాస్క్‌ఫోర్స్, ఇంటెలిజెన్స్, అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా చేపట్టిన తనిఖీల్లో ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడుకు చెందిన ఎం. తంజి, సెల్వంలను అధికారులు అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. వీరిలో తంజి చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో నమోదైన 44కు పైగా ఎర్రచందనం అక్రమ రవాణా కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

వాహనాలతో సహా ఎర్రచందనం స్వాధీనం

అరెస్టైన నిందితుల నుంచి7 ఎర్రచందనం దుంగలు, ఓ కారు, ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. స్మగ్లింగ్‌కు ఉపయోగించిన వాహనాల వివరాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. తంజికి బెంగళూరు, చెన్నై ప్రాంతాలకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నాయా? ఈ నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారు? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

స్మగ్లర్లపై కఠిన చర్యలు

శేషాచలం అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక నిఘా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. అంతర్రాష్ట్ర స్మగ్లింగ్‌ నెట్‌వర్క్‌లను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాజా ఆపరేషన్‌లో ప్రతిభ కనబరిచిన టాస్క్‌ఫోర్స్ సిబ్బందిని హెడ్ ఎల్. సుబ్బారాయుడు అభినందించారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు సమన్వయంతో మరిన్ని తనిఖీలు కొనసాగిస్తామని అధికారులు వెల్లడించారు.
also read : బస్సులో భారీ చోరీ.. బంగారం, వజ్రాభరణాలు మాయం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు