కర్ణాటకలోని ధార్వాడ్ తాలూకాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ చివరకు దారుణ హత్యకు, ఆపై ఆత్మహత్యకు దారితీసింది. గరగ గ్రామంలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. గరగ గ్రామానికి చెందిన మౌలాసాబ్ (28), అతని భార్య సల్మా (22) మధ్య గురువారం రాత్రి వివాదం తలెత్తింది. మాటామాటా పెరగడంతో ఆగ్రహానికి గురైన మౌలాసాబ్ కత్తితో భార్యపై దాడి చేసినట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాలతో సల్మా అక్కడికక్కడే మృతి చెందింది.
భార్యను హత్య చేసిన అనంతరం మౌలాసాబ్ కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న గరగ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గుంజన్ ఆర్య ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. భార్యాభర్తల మధ్య వివాదానికి దారితీసిన కారణాలు, ఘటనకు సంబంధించిన ఇతర అంశాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
also read: విజయనగరంలో 82 ఏళ్ల వృద్ధురాలిపై లైంగిక దాడి.. నిందితుడి కోసం పోలీసుల గాలింపు
