Homeక్రైమ్ఫోన్‌ విషయంలో తండ్రి మందలింపు.. తండ్రి కళ్ల ముందే ఇంటర్‌ విద్యార్థిని మృతి

ఫోన్‌ విషయంలో తండ్రి మందలింపు.. తండ్రి కళ్ల ముందే ఇంటర్‌ విద్యార్థిని మృతి

క్రైమ్ మిర్రర్ : ఫోన్‌లో ఎక్కువసేపు మాట్లాడొద్దని తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన ఇంటర్‌ విద్యార్థిని రైలు కిందపడి మృతి చెందిన విషాద ఘటన హైదరాబాద్‌లోని ఉప్పుగూడ పరిధిలో చోటుచేసుకుంది. కళ్ల ముందే కుమార్తె ప్రాణాలు కోల్పోవడంతో తండ్రి తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని ఛత్రినాక ప్రాంతంలో శ్రీనివాస్‌ కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. ఆయన కుమార్తె తేజస్వి (17) ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతోంది. చదువుతో పాటు ఫోన్‌ వినియోగం విషయంలో తేజస్వి తరచూ అర్ధరాత్రి వరకు ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు కుటుంబ సభ్యులు గుర్తించినట్లు తెలుస్తోంది.

ఈ విషయాన్ని గమనించిన తండ్రి శ్రీనివాస్‌.. అర్ధరాత్రి వరకు ఫోన్‌లో మాట్లాడటం మంచిది కాదని కుమార్తెను మందలించారు. దీంతో తేజస్వి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. అనంతరం అర్ధరాత్రి సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లింది. కుమార్తె ఇంట్లో లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో ఆమె కోసం తండ్రి వెతుక్కుంటూ వెళ్లినట్లు తెలుస్తోంది. ఉప్పుగూడ ప్రాంతంలో రైల్వే ట్రాక్‌ వద్దకు చేరుకున్న తేజస్వి.. వేగంగా వస్తున్న గూడ్స్‌ రైలు కిందపడి మృతి చెందింది. ఈ ఘటన తండ్రి కళ్ల ముందే జరగడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తేజస్వి మృతికి దారితీసిన పరిస్థితులు, ఘటనకు సంబంధించిన ఇతర వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఒక్కసారిగా చోటుచేసుకున్న ఈ విషాద ఘటనతో తేజస్వి కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె మృతి స్థానికులను కూడా కలచివేసింది.
also read : నకిలీ ఐఏఎస్‌ అధికారులుగా అక్కాతమ్ముడు.. ఉద్యోగాల పేరుతో భారీ మోసం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు