Homeక్రైమ్సూట్‌కేస్‌ మిస్టరీని ఛేదించిన పోలీసులు.. ఇంట్లో కనిపించిన దృశ్యాలతో షాక్

సూట్‌కేస్‌ మిస్టరీని ఛేదించిన పోలీసులు.. ఇంట్లో కనిపించిన దృశ్యాలతో షాక్

క్రైమ్ మిర్రర్ : చెన్నైలో వెలుగుచూసిన ఓ హత్య కేసు పోలీసులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఓ మహిళను హత్య చేసిన అనంతరం ఆమె మృతదేహాన్ని ముక్కలు చేసి.. అందులోని కొన్ని భాగాలతో బిర్యానీ తయారు చేసినట్లు దర్యాప్తులో బయటపడింది. ఈ నెల 5న తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో మానవ శరీర భాగాలు ఉన్న సూట్‌కేస్‌ లభించిన ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ విషయాన్ని గుర్తించారు. చెన్నై నుంచి ఢిల్లీ వెళ్తున్న తమిళనాడు ఎక్స్‌ప్రెస్ ఆగ్రా చేరుకున్న సమయంలో ఓ జనరల్‌ కోచ్‌లో నుంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తనిఖీ చేయగా ఎరుపు రంగు సూట్‌కేస్‌ కనిపించింది. దాన్ని తెరిచి చూడగా మానవ శరీర భాగాలు బయటపడ్డాయి.

దీంతో కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు సూట్‌కేస్‌ ఎక్కడి నుంచి రైలులోకి వచ్చిందనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. అది చెన్నై నుంచి రైలులోకి ఎక్కించినట్లు గుర్తించి తమిళనాడు పోలీసులకు సమాచారం అందించారు. చెన్నై పోలీసులు రైల్వే స్టేషన్‌తో పాటు పరిసర ప్రాంతాల్లోని 350కుపైగా సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీలో ఓ వ్యక్తి, ఓ మహిళ కలిసి ఎరుపు రంగు సూట్‌కేస్‌ను రైలులో ఉంచినట్లు గుర్తించారు. అనంతరం వారిద్దరూ లోకల్‌ రైలులో గూడువాంజేరికి వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. నిందితులు నివసిస్తున్న ఇంటిని గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్లి తనిఖీలు చేపట్టారు.

ఆ ఇంట్లో ఒడిశాకు చెందిన మాణిక్‌ ఉత్తిన్‌ లస్కర్, అతని భార్య భాగమతి మాజిక్‌తో పాటు హయాత్‌ నిషా అనే మహిళ కూడా ఉంటున్నట్లు స్థానికుల ద్వారా పోలీసులకు సమాచారం లభించింది. దీంతో సూట్‌కేస్‌లో లభించిన శరీర భాగాలు నిషావేనని పోలీసులు అనుమానించారు. ఇంట్లోకి వెళ్లి తనిఖీలు నిర్వహించగా పరిస్థితి మరింత భయానకంగా కనిపించింది. ఓ పాత్రలో అన్నంతో పాటు మానవ శరీర భాగాలు కనిపించడంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. ఇంటి పరిసరాల్లో కూడా రక్తపు మరకలను గుర్తించారు. ఆ పాత్రను స్వాధీనం చేసుకున్న పోలీసులు తదుపరి పరీక్షల కోసం చెంగల్పట్టు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇదిలా ఉండగా హత్యకు గురైన మహిళ తల కోసం పోలీసులు ప్రత్యేకంగా గాలిస్తున్నారు. లస్కర్‌ దంపతులు తనకు తమ్ముడు, మరదలు అవుతారని నిషా స్థానికులతో చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే హత్యకు అసలు కారణం ఏమిటనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. కేసును ఛేదించేందుకు పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ, ఫోరెన్సిక్ ఆధారాలు, స్థానికుల సమాచారాన్ని ఆధారంగా చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు.
also read : రాఖీ పండుగ సందిగ్ధతకు తెర: ఈ ఏడాదీ పౌర్ణమి ఏ రోజున? శుభ ముహూర్తాల వివరాలు ఇవే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు