కర్ణాటకలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తుమకూరు జిల్లాలోని బిలిగిహళ్లి గ్రామంలో నందిని డెయిరీ భవనం వద్ద జరిగిన ప్రమాదంలో ధనుష్ అనే పాఠశాల విద్యార్థి మృతి చెందాడు.
పాఠశాల సమీపంలోని డెయిరీ ప్రాంతంలో ధనుష్ ఆడుకుంటుండగా ఒక్కసారిగా భవనంలోని ఓ పిల్లర్ కూలిపోయింది. అది బాలుడి తలపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం జరిగిందా? అనే కోణంలోనూ అధికారులు విచారణ చేస్తున్నారు.
also read: కులపెద్దతో గొడవ.. తోటి కులస్తుల చేతిలో వ్యక్తి దారుణ హత్య
