Homeక్రైమ్Breaking : ఏసీబీ వలలో చందానగర్ ఎస్సై.. ఇద్దరు కానిస్టేబుళ్లు

Breaking : ఏసీబీ వలలో చందానగర్ ఎస్సై.. ఇద్దరు కానిస్టేబుళ్లు

క్రైమ్ మిర్రర్ : సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు చేపట్టిన దాడిలో చందానగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్సైతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు పట్టుబడ్డారు. లంచం తీసుకుంటున్న సమయంలో ఎస్సై ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కినట్లు సమాచారం. చందానగర్ పోలీస్ స్టేషన్‌లో అడ్మిన్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న బాలరాజుపై వచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎస్సై బాలరాజు రూ.లక్ష లంచం తీసుకుంటుండగా అధికారులు వలపన్ని పట్టుకున్నట్లు సమాచారం.

ఈ వ్యవహారంలో ఎస్సైతో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చందానగర్ పోలీస్ స్టేషన్‌లోనే ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. లంచం తీసుకున్న ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, ఈ డబ్బులు ఎవరి నుంచి తీసుకున్నారు? ఏ పని చేసేందుకు లంచం డిమాండ్ చేశారు? ఈ వ్యవహారంలో మరెవరైనా ప్రమేయం ఉందా? అనే అంశాలపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read ; నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక పరిణామం

తాజావార్తలు